Naralokesh padaytra,Yuvagalam
Naralokesh padaytra,Yuvagalam

కారంపూడిలో దద్దరిల్లిన యువగళం పాదయాత్ర బహిరంగసభకు పోటెత్తిన జనం…మహిళల నీరాజనం

గురజాల నియోజకవర్గంలో యువనేతకు ఘనస్వాగతం

మాచర్ల: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్రకు మాచర్ల నియోజకవర్గంలో కనీవినీ ఎరుగని రీతిలో స్పందన లభించింది. యువనేత లోకేష్ రాకతో కారంపూడి పట్టణ వీధులు కిటకిటలాడాయి. దారిపొడవునా మహిళలు యువనేతకు హారతులతో నీరాజనాలు పట్టారు. కారంపూడి వీర్లగుడి సెంటర్ లో నిర్వహించిన బహిరంగసభకు నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్దఎత్తున తరలిరావడంతో పరిసరాలు కిటకిటలాడాయి. కారంపూడి పట్టణంలో వివిధ వర్గాల ప్రజలు యువనేత లోకేష్ ను కలుసుకొని నాలుగేళ్ల రాక్షసపాలనలో తాము ఎదుర్కొంటున్న కష్టాలను ఏకరువుపెట్టారు. మరో 9నెలలు ఓపిక పట్టాలని, రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి కష్టాలు తీరుస్తుందని భరోసా ఇస్తూ యువనేత ముందుకుసాగారు. కారంపూడి శివారు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైన 177వరోజు పాదయాత్ర కారంపూడి తాండా, ఎన్ఎస్ పి కెనాల్, చెక్ పోస్టు, చెన్నకేశవస్వామి గుడి, వీర్లగుడి సెంటర్, సన్నిగుండ్ల మీదుగా గురజాల అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించి, జూలకల్లు శివారు విడిది కేంద్రానికి చేరుకుంది. జూలకల్లు శివార్లలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు నేతృత్వంలో యువనేత లోకేష్ కు ఘనస్వాగతం లభించింది. బాణాసంచా మోతలు, డప్పుశబ్ధాలు, విచిత్ర వేషధారణల నడుమ కార్యకర్తల కేరింతలు కొడుతూ యువనేతను స్వాగతించారు. 177వరోజు యువనేత లోకేష్ 10.7 కి.మీ.ల మేర పాదయాత్ర సాగించారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2354.1 కి.మీ.ల మేర పూర్తయింది. గురజాల నియోజకవర్గం పిడుగురాళ్లలో మంగళవారం నిర్వహించే బహిరంగసభలో యువనేత లోకేష్ ప్రసంగించనున్నారు. 

ప్రాజెక్టులు కట్టడం చేతగాక ప్రతిపక్షనేతపై దాడులా? నీళ్లు కావాలో, రక్తం కావాలో తేల్చుకోవాల్సింది రాష్ట్రప్రజలే

మాచర్లలో పెచ్చురిల్లిపోతున్న ఎమ్మెల్యే పిన్నెల్లి ఆగడాలు

టిడిపి కేడర్ ను వేధిస్తున్న పిన్నెల్లికి భయాన్ని చూపిస్తా

కారంపూడి బహిరంగసభలో నిప్పులు చెరిగిన నారాలోకేష్

కారంపూడి: ఇటీవల రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని ఒక వింత జరిగింది, అధికారంలో ఉన్న పార్టీ బంద్ కి పిలుపు ఇచ్చింది. ఆర్టీసీ బస్సులు, అమర్ రాజా కంపెనీ బస్సులు ధ్వంసం చేసి, ఉద్యోగస్తుల పై దాడి చేసింది. కారంపూడి వీర్లగుడి సెంటర్ లో నిర్వహించిన బహిరంగసభలో యువనేత లోకేష్ మాట్లాడుతూ… ఒక్క ప్రాజెక్టు కట్టడం చేతగాని దిక్కుమాలిన సీఎం ప్రతిపక్ష నేత మీద దాడి చేయించాడు. చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి కండువా వేసుకోని  వైసిపి కార్యకర్త. ప్రతిపక్ష నేతపై వైసిపి వాళ్లు చేసిన రాళ్ల దాడి ఆయనకి కనపడలేదు అంట. ఇంకో 9 నెలలు ఓపిక పట్టు నీ కళ్లకు ఆపరేషన్ చేయించి అన్ని కనిపించేలా చేస్తాం. రిషాంత్ రెడ్డి యా ఆర్ అన్ ఫిట్ టూ బి ఐపీఎస్. నువ్వు ఐపీఎస్ కాదు పిపిఎస్( పెద్దిరెడ్డి పర్సనల్ సర్వీస్). నీకు అంత సరదాగా ఉంటే పోలీస్ డ్రెస్ తీసి బులుగు కండువా కప్పుకో. నీ తొక్కలో కేసులకు భయపడే వాడు ఎవడూ లేడు. నీళ్లు కావాలో, రక్తం కావాలో రాష్ట్ర ప్రజలు తేల్చుకోండి.

మాచర్ల గడ్డపై పాదయాత్ర అదృష్టం

పౌరుషాల గడ్డ పల్నాడు. మంచితనం మాచర్ల ప్రజల బ్లడ్ లో ఉంది. కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజలు విడిపోకూడదని అందరికీ ఒకే చోట భోజనాలు ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి  పల్నాటి బ్రహ్మనాయుడు.  సామాన్య మహిళ నుండి మహాశక్తి గా ఎదిగి, పల్నాడు రాజ్యానికి మంత్రిగా పనిచేసిన వీర మహిళ నాగమ్మ. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం భూముల్ని త్యాగం చేసిన గొప్ప మనస్సు మాచర్ల ప్రజలది. పల్నాటి పౌరుషాన్ని బ్రిటిష్ వాళ్లకి చూపించిన స్వాతంత్య్ర సమరయోధుడు కన్నెగంటి హనుమంతు జన్మించిన నేల మాచర్ల. ఎంతో ఘన చరిత్ర ఉన్న మాచర్ల గడ్డ పై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం.

జె-ట్యాక్స్ పై మహిళలు తిరగబడాలి!

ఒకప్పుడు కేరళ ని పాలించిన కొంతమంది రాజులు రొమ్ము పన్ను వేసారు.  రొమ్ముపై పన్ను వేసింది మార్తాండ వర్మ అయితే చెత్త పై కూడా పన్నేసిన పాలకుడు .పేదల ఏడుపులు ఆయనకి ఆనందాన్ని ఇస్తాయి, అందుకే విద్యుత్ ఛార్జీలు 9 సార్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు. మీకు ఇంకో ప్రమాదం కూడా ఉంది. త్వరలోనే వాలంటీర్ వాసు మీ ఇంటికి వస్తాడు. మీరు పీల్చే గాలిపై కూడా పన్నేస్తాడు. ప్రతి దానిపై తన బొమ్మ వేసుకునే కరెంట్ బిల్లు మీద, బస్సు టికెట్ మీద, పెట్రోల్, డీజిల్ బిల్లు మీద, చెత్త పన్ను మీద, ఇంటి పన్ను మీదా బొమ్మ ఎందుకు వేసుకోవడం లేదు?  రాజు మార్తాండ వర్మ పై పోరాడిన మహిళ పేరు నంగేలి. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి మహిళా వీర మహిళ నంగేలిని ఆదర్శంగా తీసుకోని ప్రభుత్వం పై పోరాడాలి, అప్పుడే పెంచిన పన్నులు తగ్గుతాయి.

100 సంక్షేమ పథకాలు రద్దుచేసిన వైసీపీ

ఎవరైనా సీఎం అయితే ప్రజలకు ఇంకా ఏమి చెయ్యాలి అని ఆలోచిస్తారు.  అన్న క్యాంటిన్ రద్దు, పండుగ కానుక రద్దు, పెళ్లి కానుక రద్దు, చంద్రన్న భీమా రద్దు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దు, ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు, 6 లక్షల పెన్షన్లు రద్దు, డ్రిప్ ఇరిగేషన్ రద్దు. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు ఏం మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు.

 మహిళల కన్నీళ్లు తుడిచేందుకే మహాశక్తి

2,300 కి.మీ.ల పాదయాత్రలో మీ కష్టాలు చూసాను…కన్నీళ్లు తుడుస్తాను . భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం. మహాశక్తి పథకం కింద… ఆడబిడ్డ నిధి:- 18 ఏళ్లు నిండిన మహిళలకు – నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. 2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు. ఇద్దరు ఉంటే రూ.30 వేలు. 3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం 4) ఉచిత ప్రయాణం:- మహిళలకు ఉచిత ప్రయాణం. 

నిరుద్యోగ యువకులతో రూ.3వేల భృతి

యువత భవిష్యత్తు పై దెబ్బకొట్టాడు. యువత ఎప్పుడూ పేదరికంలో ఉండాలి అని కోరుకుంటున్నాడు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్  పధకం రద్దు చేసాడు. యువగళాన్ని విన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.  నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం. పెండింగ్ పోస్టులు అన్ని భర్తీ చేస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం.

మోటార్లకు మీటర్లతో రైతులకు ఉరితాళ్లు

వైసీపీ  పరిపాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో రైతులు నష్టపోతున్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నంబర్ 3, కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2.  రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మోటార్లకు మీటర్లు పెడుతున్నాడు. ఆ మీటర్లు రైతులకు ఉరితాళ్లు. మీటర్లు బిగిస్తే పగలగొట్టండి. టిడిపి మీకు అండగా ఉంటుంది. రైతుల బాధలు చూసాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాత పథకం కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం. జగన్ ఉద్యోగస్తులను వేధిస్తున్నాడు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని  200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. ఇప్పుడు జిపిఎస్ అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టాడు.  

పోలీసులకు కూడా అలవెన్స్ కట్!

పోలీసులకు కూడా 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు. నేను ప్రతి రోజూ మాట్లాడుతుంటే భయపడి కొంత బకాయి తీర్చాడు. ఇంకా రావాల్సింది చాలా ఉంది.ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని దివాలాకోరు ప్రభుత్వం ఇది. ఇప్పుడు ఏకంగా పోలీసులకు ఇచ్చే అలవెన్స్ కూడా కోతపెట్టాడు జగన్. 15 శాతం అలవెన్స్ కట్ చేసాడు.  ఎస్ఐ కి 10 వేలు, హెడ్ కానిస్టేబుల్ కి 8 వేలు, కానిస్టేబుల్ కి 6 వేలు కట్ చేసాడు.

బిసిలకోసం ప్రత్యేక రక్షణ చట్టం

బీసీలు పడుతున్న కష్టాలు నేను నేరుగా చూసాను. పాలనలో 26 వేల బిసిలపై అక్రమ కేసులు, నిధులు, కుర్చీలు లేని కార్పొరేషన్లు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపకులాల వారీగా నిధులు, బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి డాక్టర్ అచ్చెన్న వరకూ పాలనలో దళితుల్ని ఎలా చంపారో చూసారు. దళితుల్ని చంపడానికి వైసిపి నాయకులకు స్పెషల్ లైసెన్స్ ఇచ్చాడు. 27 దళిత సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు.  టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులను వేధించిన వారిని కఠినంగా శిక్షిస్తాం. జగన్ రద్దు చేసిన 27 దళిత సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తాం. జగన్ పాలనలో మైనార్టీలను చిత్ర హింసలకు గురిచేసాడు. అబ్దుల్ సలాం, కరీముల్లా, ఇబ్రహీం, మిస్బా, హజీరా. ఇలా ఎంతో మంది బాధితులు. మైనార్టీలకు ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు.

మాచర్లను అభివృద్ధి చేసింది టిడిపి!

తెలుగుదేశం పార్టీని గెలిపించకపోయినా 2014 నుండి 2019 వరకూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసాం. 2 వేల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది టిడిపి. గ్రామాల్లో సిసి రోడ్లు, సాగు, తాగునీటి ప్రాజెక్టులు, పేదలకు ఇళ్లు, డబల్ రోడ్లు, టిడ్కో ఇళ్లు, పంచాయతీ భవనాలు, కమ్యూనిటీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, ఆఖరికి స్మశానాలు కూడా అభివృద్ధి చేసింది టిడిపి. కానీ మీరు పాలిచ్చే ఆవుని వద్దనుకుని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారు. మాచర్లని అభివృద్ధి చేస్తాడని మీరు నాలుగుసార్లు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని గెలిపించారు. నాలుగేళ్లుగా మాచర్ల లో అభివృద్ధి నిల్లు..అరాచకం ఫుల్లు. మాచర్ల లో జరుగుతున్న అవినీతి, అరాచకాల గురించి తెలుసుకున్న తరువాత పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి పేరును పిల్లి రామకృష్ణా రెడ్డిగా మార్చా.

మాచర్లను దోచేస్తున్న పిన్నెల్లి సోదరులు

పిల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడు పిల్లి వెంకట్రామిరెడ్డి కలిసి నియోజకవర్గాన్ని దోచుకుంటున్నారు. ప్రకాశం,బాపట్ల,పల్నాడు జిల్లాల నుంచి వచ్చే గ్రానైట్ లారీలు తెలంగాణ ప్రాంతానికి వెళ్ళాలి అంటే పిల్లి బ్రదర్స్ కి లారీకి రూ.23 వేల చొప్పున పన్నుకట్టాలి. రోజుకు 200 లారీల నుంచి రూ.46 లక్షల రూపాయలు దండుకుంటున్నారు. ఈ లారీల ద్వారా నాలుగేళ్లలో దోచింది రూ.700 కోట్లు.  రాష్ట్రమంతా జే బ్రాండ్లు అమ్ముతుంటే మాచర్ల లో మాత్రం పి బ్రాండ్ లిక్కర్ అమ్ముతున్నారు పిల్లి బ్రదర్స్. 77 గ్రామాలు, ఊరికి 5 బెల్టు షాపులు, నంబర్ లేని వాహనాల్లో పి బ్రాండ్ లిక్కర్ సరఫరా. ఒక్కో క్వార్టర్ పై రూ.60 పి ట్యాక్స్. లిక్కర్ లో రోజుకి రూ.25 లక్షల ఆదాయం. మహిళల తాళిబొట్లు తెంచి పిల్లి బ్రదర్స్ లిక్కర్ లో సంపాదించింది రూ.400 కోట్లు. గుట్కా,మట్కా,గంజాయి,పేకాట క్లబ్బులు అన్నీ పిల్లి బ్రదర్స్ గ్యాంగులే నడిపిస్తున్నాయి.  ఆత్మకూరు,రాయవరం,అలుగురాజు పల్లి, అడిగొప్పల అమ్మవారి గుడి  పరిసర ప్రాంతాల్లో గ్రావెల్ అక్రమంగా తవ్వేస్తున్నారు. ఒక్క గ్రావెల్ దోపిడీ లోనే పిల్లి బ్రదర్స్ ఆదాయం రూ.70 కోట్లు.

రేషన్ బియ్యంపై రూ.73కోట్లు స్వాహా!

ఇటుక తయారీ పరిశ్రమ యజమానుల్ని బెదిరించి 5 కోట్లు కప్పం కట్టించుకున్నాడు. రేషన్ బియ్యం అక్రమ రవాణా ద్వారా రూ.73 కోట్లు సంపాదించారు. నాగార్జున సాగర్ సాగునీటి కాల్వల నిర్వహణ మరియు మరమత్తులను బినామీ కాంట్రాక్టరుతో చేయించి 30 కోట్లు మింగేశారు.  పనులు చేయకుండానే సుమారు 15 కోట్లు పంచాయతీల నిధులు స్వాహా చేశారు. కౌలు రైతుల పేర్లతో రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీలు కొట్టేసారు పిల్లి బ్రదర్స్. మాచర్లలో ఎవరైనా అపార్ట్మెంట్ కట్టాలి అంటే పిల్లి బ్రదర్స్ కి రూ.20 లక్షలు కప్పం కట్టాలి. రైతులు  పొలం పాస్బుక్ కోసం  అప్లై చేస్తే ఎకరాకు 15 వేలు వసూలు చేస్తున్నారు. తాళ్లపల్లి గ్రామం పరిధిలో 50 కోట్ల విలువైన  250 ఎకరాలు కబ్జా చేసారు. మాచర్ల పట్టణంలో ప్రభుత్వ భూమిలో అక్రమంగా లేఅవుట్లు వేసి అమ్ముకున్నారు.

పసుపు సైన్యాన్ని చూస్తే వారికి భయం!

 పసుపు సైన్యాన్ని చూస్తే భయం. పిల్లి బ్రదర్స్ పోలీసుల్ని, రౌడీలను అడ్డం పెట్టుకొని బ్రతుకుతున్నారు. బిసి నాయకులు చంద్రయ్య, జల్లయ్య లను కిరాతకంగా నడి రోడ్డు మీద నరికి చంపేసారు. టిడిపి క్యాడర్ నాట్ ఫర్ సేల్. చంద్రయ్య గొంతు పై కత్తి పెట్టి వాళ్ల నాయకుడి పేరు చెప్పమంటే జై చంద్రబాబు, జై టిడిపి అన్నారు. అదీ టిడిపి దమ్ము. పంగా వెంకటేశ్వర్లు, గన్నెబోయిన గంగరాజుని, కోటయ్యను హత్య చేశారు. పిల్లి బ్రదర్స్ చాలా పెద్ద తప్పు చేసారు. నా కార్యకర్త వైపు చూస్తేనే నేను ఉరుకోను అలాంటిది నాయకుల్ని, కార్యకర్తల్ని చంపారు. నేను ఊరుకుంటానా? పిల్లి బ్రదర్స్  భయాన్ని పరిచయం చేసే బాధ్యత నాది. బ్రహ్మరెడ్డిని చూస్తే పిల్లి బ్రదర్స్ వణికిపోతారు. 2024 లో మన పులి ఎమ్మెల్యే అవ్వడం ఖాయం. మాచర్లలో ప్రజలు ప్రశాంతంగా ఉండాలి అంటే బ్రహ్మారెడ్డి గెలవాలి. పిల్లి బ్రదర్స్ అండ్ గ్యాంగ్ మాచర్ల లో ఉన్నా మద్రాసులో పారిపోయినా పట్టుకొచ్చి లోపలేస్తా.

వరికపూడిశెల పూర్తిచేస్తాం!
 టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వాటర్ గ్రిడ్ పధకం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత తాగునీరు అందిస్తాం.  వరికెపూడిశెల ప్రాజెక్టు పూర్తి చేస్తాం. మాచర్ల పట్టణంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేస్తాం. మాచర్లలో ఉన్న 50 పడకల ఆసుపత్రి పరిధిని పెంచి అన్ని వైద్య సదుపాయాలతో 100 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ గా మార్పు చేస్తాం. దుర్గి మిర్చి యార్డులో అన్ని వసతులు కల్పించి పూర్తిస్థాయిలో అమ్మకాలు,కొనుగోళ్ల లావాదేవీలు జరిగేలా చర్యలు తీసుకుంటాం. అవసరమైన మేర కోల్డ్ స్టోరేజ్ లు ఏర్పాటు చే

నారా లోకేష్ ను కలిసిన పేటసన్నిగండ్ల రైతులు

మాచర్ల నియోజకవర్గం పేటసన్నిగండ్ల రైతులు నారా లోకేష్ ను కలిసి సమస్యలపై వినతిపత్రం అందించారు. గత ప్రభుత్వంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రూ.3.80కోట్లతో పనులు ప్రారంభించారు. కానీ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పట్టించుకోలేదు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పూర్తైతే 1250 ఎకరాలకు సాగునీరు అందుతుంది. మంచినీటి చెరువుకు కూడా నీరు సరఫరా అయి తాగునీటి సమస్య తీరుతుంది. మీరు అధికారంలోకి వచ్చాక లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తిచేసి మా గ్రామకష్టాలు తీర్చండి.

నారా లోకేష్ మాట్లాడుతూ

ప్రాజెక్టుల గేట్లకు గ్రీజు పెట్టలేని దివాలాకోరు ప్రభుత్వం కొత్తపథకాల నిర్మాణం చేపట్టే పరిస్థితి లేదు. TDP హయాంలో సాగునీటీ ప్రాజెక్టులపై రూ.68,294 కోట్లు ఖర్చే చేస్తే, వైసీపీ ప్రభుత్వం ఖర్చుచేసింది కేవలం రూ.22 వేల కోట్లు మాత్రమే. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నమయ్య ప్రాజెక్టు, పులిచింతల, గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయాయి. ఆయా ప్రాంతాల్లో పాడైపోయిన గేట్లను బాగుచేయలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది.  టిడిపి అధికారంలోకి రాగానే తాగు, సాగునీటి ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యతనిస్తాం.  పేటసన్నిగండ్లలోని లిఫ్ట్ ఇరిగేషన్ ను అధికారంలోకి వచ్చాక పూర్తి చేసి, రైతుల కష్టాలు తొలగిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన కారంపూడి ముస్లింలు

మాచర్ల నియోజకవర్గం కారంపూడి చెక్ పోస్టు వద్ద ముస్లిం సామాజికవర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో సుమారు 4 వేల ముస్లిం జనాభా ఉంది. గత ప్రభుత్వంలో షాదీఖానా నిర్మించారు. ఇతర మౌలిక సదుపాయాలకు రూ.25 లక్షల అవసరం. గత ప్రభుత్వంలో స్మశానానికి చుట్టూ నిర్మించ తలపెట్టిన ప్రహరీ అసంపూర్తిగా ఉండిపోయింది. దాన్ని పూర్తి చేసేందుకు రూ.15 లక్షలు అవసరం ఉంది. వైసిపి ప్రభుత్వం వచ్చాక ఎన్నిసార్లు విన్నవించినా ప్రయోజనం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక నిధులు కేటాయించి వాటిని పూర్తి చేయాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ

వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముస్లిం మైనారిటీలకు ఖర్చచేయాల్సిన రూ.5400 కోట్లు దారిమళ్లించారు. గత ప్రభుత్వంలో మసీదుల నిర్మాణం, మరమ్మతులకు సాయమందించాం. వైసీపీ వచ్చాక షాదీఖానాల నిర్మాణాలను గాలికొదిలేసింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మైనారిటీలపై దాడులు పెరిగాయి. నర్సరావుపేటలో మసీదు ఆస్తుల పరిరక్షణ కోసం పోరాడిన ఇబ్రహీంను దారుణంగా నరికి చంపారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కారంపూడి షాదీఖానా నిర్మాణం, ఖబరిస్థాన్ ప్రహరీగోడ నిర్మాణాలను పూర్తిచేస్తాం.

నారా లోకేష్ ను కలిసిన నిరుద్యోగ యువకులు

మాచర్ల నియోజకవర్గం కారంపూడి చెన్నకేశవస్వామి గుడివద్ద నిరుద్యోగ యువకులు లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మాచర్ల నియోజకవర్గం పల్నాడులో ఎంతో వెనకబడింది.  ఉన్నత చదువులు పూర్తైనా జాబ్ నోటిఫికేషన్లు లేక ఇబ్బందులు పడుతున్నాం. టీడీపీ హయాంలో వచ్చిన కంపెనీలు కూడా వైసీపీ వచ్చాక పక్క రాష్ట్రాలకు వెళ్తున్నాయి. మీరు అధికారంలోకి వచ్చాక పరిశ్రమలు ఏర్పాటుచేసి, మా ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలి. ఈ ప్రభుత్వం నిరుద్యోగులను చిన్నచూపు చూస్తోంది. నిరుద్యోగ భృతి కల్పించి ఆదుకోవాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ

నాలుగేళ్లుగా ఎటువంటి జాబ్ నోటిఫికేషన్లు లేకపోవడంతో 470మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. జగన్ అండ్ కో జె-ట్యాక్స్ బెడద తట్టుకోలేక పరిశ్రమలు పక్కరాష్ట్రాలకు తరలిపోతున్నాయి. అమరరాజా, జాకీ, కియా అనుబంధ సంస్థలలతోపాటు తాజాగా ఫాక్స్ కాన్ కూడా వెళ్లిపోయింది. టిడిపి అధికారంలోకి రాగానే ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి రంగాల ద్వారా 20 లక్షల ఉద్యోగాలిస్తాం. ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగులకు యువగళం నిధి కింద 3వేల రూపాయల భృతి ఇస్తాం. ప్రతిఏటా జాబ్ నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేస్తా

నారా లోకేష్ ను కలిసిన కారంపూడి మండల ప్రజలు

మాచర్ల నియోజకవర్గం కారంపూడి ఎన్ఎస్ పి కెనాల్ వద్ద కారంపూడి మండల ప్రజలు నారా లోకేష్ ను కలిసి వినతిపత్రం అందించారు. కారంపూడి మండలంలో తాగునీటి సమస్య అధికంగా ఉంది.  రోడ్లు కూడా అధ్వాన్నంగా ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. మండల పరిధిలో చాలా మంది ఇళ్లులేని పేదలున్నారు..వారికి పక్కా ఇళ్లు నిర్మించాలి. అనధికార కరెంట్ కోతలతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మీరు అధికారంలోకి వచ్చాక మా మండల సమస్యలు పరిష్కరించండి.

నారా లోకేష్  మాట్లాడుతూ

తమను ఎన్నుకున్న ప్రజలకు గుక్కెడు నీరందించలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉంది. మాచర్ల నియోజకవర్గంలో నీళ్లుపారించడం చేతగాని ఎమ్మెల్యే పిన్నెళ్లి రక్తం పారిస్తున్నాడు. జల్ జీవన్ మిషన్ పథకం అమల్లో రాష్ట్రం 18వ స్థానంలో ఉంది. కేంద్రం ఇచ్చే నిధులను కూడా ఉపయోగించుకోలేని చేతగాని ముఖ్యమంత్రి ఉండటం రాష్ట్రప్రజల దౌర్భాగ్యం. టీడీపీ అధికారంలోకి వచ్చాక వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా మంచినీటిని అందిస్తాం.  గత ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో 25వేల కి.మీ.ల సిసి రోడ్లు వస్తే, ఈ ప్రభుత్వం వచ్చాక రోడ్లపై తట్టమట్టి పోయలేదు. అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, మౌలిక సదుపాయాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం. ఇల్లులేని ప్రతిపేదవాడికి ఇల్లు నిర్మించి ఇస్తాం. గ్రామాల్లో సైతం నిరంతర విద్యుత్ సరఫరా చేస్తాం.

నారా లోకేష్ ను కలిసిన మాచర్ల నియోజకవర్గ ప్రజలు

సన్నగండ్ల గ్రామంలో మాచర్ల నియోజకవర్గ ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. గతంలో ప్రఖ్యాతిగాంచిన పల్నాడు..ఇప్పుడు కనీస వైద్య సౌకర్యాలకు నోచుకోలేదు. రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలు ఏ చిన్న అనారోగ్యానికి గురైనా గుంటూరు లేదా నర్సరావుపేట వెళ్లాల్సివస్తోంది. దీంతో సరైన వైద్యం అందక మార్గమధ్యలోనే ప్రాణాలు పోతున్నాయి. ఈ ప్రాంతంలో 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ

వైసీపీ అధికారంలోకి వచ్చాక వైద్య,ఆరోగ్యశాఖ పూర్తిగా నిర్వీర్యమైంది. పెద్దసుపత్రుల్లో సైతం కనీస సౌకర్యాలను ఏర్పాటు చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది. టీచింగ్ ఆసుపత్రుల్లో సైతం సూదులు, గాజుగుడ్డ అందుబాటులో ఉండటం లేదు.  రూ.1200 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్ లో పెట్టడంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందడం లేదు. అధికారంలోకి వచ్చాక మాచర్లలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపడతాం.

Also Read this Blog:A Walk for the People: Naralokesh’s Padayatra Experience

Tagged:#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *