*టిడిపి అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి పెట్టుబడుల వరద!*
*మొదటి వందరోజుల్లోనే విశాఖకు ఐటి కంపెనీలను రప్పిస్తాం*
*తప్పుచేయలేదు కాబట్టే ప్రజల మధ్యన ఉండి పోరాడుతున్నా*
*మూడేళ్లలో ప్రజారాజధాని అమరావతి నిర్మాణం పూర్తిచేస్తాం*
*కెజి టు పిజి విద్యావ్యవస్థలో సమూల ప్రక్షాళన చేపడతాం*
*ఫీజు రీఎంబర్స్ మెంట్ విధానంతో విద్యార్థుల కష్టాలు తీరుస్తాం*
*ఎన్నికల్లో యువతకు 40శాత సీట్ల హామీకి కట్టుబడి ఉన్నాం*
*రాజకీయాలకు అతీతంగా యూనివర్సిటీ విసిలను నియమిస్తాం*
*ప్రతిఏటా జాబ్ క్యాలండర్ తో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీచేస్తాం*
*మహిళల వంక చూడాలంటే భయపడేలా చట్టాలు అమలుచేస్తాం*
*పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం*
*హాలో లోకేష్ కార్యక్రమంలో యువగళం రథసారధి నారా లోకేష్*
మంగళగిరి: చంద్రబాబునాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రానికి పెట్టుబడులు వరదలా వస్తాయని, మొదటి వందరోజుల్లోనే విశాఖకు ఐటి పరిశ్రమలు తెస్తామని యువనేత Nara Lokesh పేర్కొన్నారు. మంగళగిరి సమీపంలోని యర్రబాలెంలో నిర్వహించిన హలో లోకేష్ కార్యక్రమంలో తమ భవిష్యత్తుపై యువత వ్యక్తంచేసిన సందేహాలకు లోకేష్ విస్పష్టమైన సమాధానాలిచ్చారు. కార్యక్రమానికి టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. యువనేత లోకేష్ మాట్లాడుతూ… రాష్ట్రానికి పరిశ్రమలు రాబట్టేందుకు తమ వద్ద చంద్రబాబు అనే బ్రాండ్ ఉందని, ఆ బ్రాండ్ తోనే గతంలో కియా, టిసిఎల్, ఫ్యాక్స్ కాన్, సెల్ కాన్ వంటి ప్రఖ్యాత పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయని చెప్పారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ప్రజారాజధాని అమరావతిని పూర్తిచేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఉద్యోగాల్లేక తీవ్ర నిరాశ, నిస్పృహల్లో ఉన్న యువత గళాన్ని ప్రభుత్వానికి విన్పించేందుకే యువగళం పాదయాత్ర ప్రారంభించానని అన్నారు. తప్పుచేయలేదు కాబట్టే ప్రజల మధ్య ఉంటూ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతున్నా. గత నాలుగేళ్లుగా యూనివర్సిటీలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చారు. విశ్వవిద్యాలయాల్లో రాజకీయ జోక్యాన్ని తొలగించి, విద్యాప్రమాణాల పెంపుదలకు కృషిచేస్తాం.
విద్యావ్యవస్థలో సమూల ప్రక్షాళన
టిడిపి అధికారంలోకి వచ్చాక కెజి పిజి విద్యావ్యవస్థలో సమూలన ప్రక్షాళన చేస్తాం. చదువు పూర్తయ్యేటప్పటికి రెడీ టు జాబ్ యువతను తయారు చేస్తాం. పాత ఫీజు రీఎంబర్స్ మెంట్ విధానాన్ని అమలుచేసి విద్యార్థుల కష్టాలకు చెక్ పెడతాం. ఇప్పటికే ఆయా విద్యాసంస్థల్లో ఉండిపోయిన 2లక్షలమంది సర్టిఫికెట్లను వన్ టైమ్ సెటిల్ మెంట్ ద్వారా విద్యార్థులకు ఇప్పిస్తాం. రాజకీయాల్లో యువతను ప్రోత్సహించాలని నిర్ణయించాం. రాబోయే ఎన్నికల్లో యువతకు 40శాతం సీట్లు ఇవ్వాలన్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం నుంచే ప్రతిఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేస్తాం. యుపిఎస్ సి మాదిరి ఎపిపిఎస్సీని పటిష్టపర్చి, నిర్ణీత సమయాల్లో ఉద్యోగాలకు పరీక్షలు, ఇంటర్వ్యూలు, నియమకాలు జరిగేలా చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో ప్రతిరోజూ మహిళలపై దాడులు, మానభంగాలు జరుగుతుంటే ఎందుకు వెళ్లలేదు? లేని దిశచట్టం కారణంగానే కామాంధులు రోడ్లపై ధైర్యంగా తిరగగలగుతున్నారు. టిడిపి వచ్చాక మహిళలవంక చూడాలంటేనే భయపడేలా చట్టాలను కఠినంగా అమలుచేస్తాం. గత నాలుగేళ్లుగా యువత ఉద్యోగాల్లేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయి. ఎపిలో ఉద్యోగాల్లేక పొరుగు రాష్ట్రాలకు వలసవెళ్తున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ, ప్రైవేటు, స్వయం ఉపాధి రంగాల్లో 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. చంద్రబాబు సిఎం రాష్ట్రం మళ్లీ గాడిలో పడుతుంది. అంతిమంగా పేదరికం లేని రాష్ట్రంగా ఎపిని తీర్చిదిద్దడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని యువనేత నారా లోకేష్ చెప్పారు.
యువతకు కావాల్సిందేమిటి?*
యువతకు నేను 5 ప్రశ్నలు వేస్తున్నా. 1.మీకు నెలకు రూ.5 వేల జీతం వచ్చే ఉద్యోగం కావాలా..రూ.50 వేల ఉద్యోగం కావాలా? 2.బూబ్, బూమ్ ప్రెసిడెంట్ మెడల్ లాంటి పరివ్రమలు కావాలా..కియా, ఫాక్స్, హెచ్.సీఎల్ లాంటి పరిశ్రమలు కావాలా.? 3.ఏపీ..జాబ్ కేపిటల్ ఆఫ్ ఇండియా కావాలా..గంజాయి కేపిటల్ ఆఫ్ ఇండియా కావాలా? 4.ఇక్కడి యువతకు పక్క రాష్ట్రాల్లో ఉద్యోగాలు కావాలా.. ఉద్యోగాల కోసం ఇక్కడికి వచ్చే రాష్ట్రం కావాలా? 5.రాజధాని లేని రాష్ట్రం కావాలా..అమ్మలాంటి అమరావతి రాజధాని ఉన్న రాష్ట్రం కావాలా?
మార్పు కోరుకుంటే ఓటేయండి
సమాజంలో మనం కోరుకునే మార్పు రావాలనుకునేవారు..ఆ మార్పు ముందు మనలో రావాలని గాంధీ అన్నారు. మీరు ఏ మార్పు కోరుకుంటున్నారో..ఆ మార్పు కోసమే వచ్చే ఎన్నికల్లో మీరు ఓటేయాలి. ఒక ఆంధ్రుడిగా నేను బాధపడుతున్నా..తలదించుకునే పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దాడులు, భూదందాలు జరుగుతున్నాయి. పక్క రాష్ట్రాల్లో పరిశ్రమలు వస్తున్నాయి. చంద్రబాబు సీఎం అయితేనే దారి తప్పిన రాష్ట్రం గాడిలో పడుతుంది.
*హలో లోకేష్ కార్యక్రమంలో యువత ప్రశ్నలు – లోకేష్ సమాధానాలు:*
మహాసేన రాజేశ్ : మీ వయసు చాలా తక్కువ..మీ నాన్న 14 ఏళ్లు సీఎంగా ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి 5 ఏళ్లు సీఎంగా ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి అధికారంతో కొడుకు జగన్..67 కంపెనీలు పెట్టుకుని లక్ష కోట్లు దోచుకున్నారు. మీరు కూడా మీ నాన్న 14 ఏళ్ల సీఎం పదవి అండతో 200 కంపెనీలు పెట్టుకుని రూ.3 లక్షలు కోట్లు దోచుకోక పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు?
లోకేష్ : నా పాదయాత్ర యువత కోసం చేస్తున్నా. రాష్ట్రం అన్ని రంగాల్లో వెనక్కిపోతోంది. యువతలో చైతన్యం తీసుకొచ్చేందుకు పాదయాత్ర చేస్తున్నా. యువత సోషల్ మీడియా పోస్టు పెడితే ఈ ప్రభుత్వం కేసులు పెడుతోంది. 2019 తర్వాత నాపై 20 కేసులు పెట్టారు. రాష్ట్రం కోసం పోరాడుతన్నవారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారు.
మహాసేన రాజేశ్ : జగన్ పాదయాత్ర చేశారు..చంద్రబాబు రక్షణ కల్పించారు. విశాఖ ఎయిర్ పోర్టులోకి వెళ్లి కోడికత్తితో పొడిపించుకుని డ్రామా ఆడారు. రాష్ట్రంలోని ఆసుపత్రులపై నమ్మకం లేక హైదరాబాద్ వెళ్లారు. ఈ ప్రభుత్వంలో మీరు రోజూ యుద్ధం చేస్తున్నారు..రాళ్ల, గుడ్లు వేస్తున్నారు. ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. మీకు ఏరోజైనా భయం వేసిందా.?
లోకేష్ : భయం అనే పదం వింటే మామయ్య డైలాగ్ గుర్తుకొస్తోంది..భయం అనే పదం నా బయోడేటాలో లేదు. ఏ తప్పూ చేయని మనం ఎందుకు భయపడాలి.? నేను తండ్రిని అడ్డం పెట్టుకుని సంపాదించుకోలేదు. యువత కోసం, ప్రజల కోసం పాదయాత్ర చేస్తున్నా..తగ్గేదే లేదు.
యశ్వంత్, పెనుమూడి, దుగ్గిరాల మండలం: నేను హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నా..వారు హమారా హైదరాబాద్ అని గొప్పగా చెప్పుకుంటున్నారు. మా రాజధాని ఏది అని చెప్పుకోవాలి..మాకేంటి ఈ ఖర్మ.?
లోకేష్ : 9 నెలలు ఆగితే అమరావతే మన రాజధాని అవుతుంది. దేశం మొత్తం ఏపీ వైపు చూసే విధంగా చంద్రబాబు చేస్తారు. అమరావతితో పాటు ఉమ్మడి 13 జిల్లాలు అభివృద్ధి చేస్తామని చెప్పాం. ఇచ్చిన హామీలు నెరవేర్చుతాం. TDP వచ్చాక ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి రంగాల ద్వారా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఆంధ్రులు పక్కరాష్ట్రం వైపు చూడకుండా చేస్తాం.
జ్యోషిత, గుంటూరు : యేటా జనవరిలో బాజ్ కేలండర్ విడుదల చేస్తామని గతంలో జగన్ చెప్పారు..కానీ నాలుగేళ్లుగా నోటిఫికేషన్లు విడుదుల చేయలేదు. సాక్షి కేలండర్ మాత్రం యేటా విడుదల చేస్తున్నారు. మీరొచ్చాక యేటా జాబ్ కేలండర్ విడుదల చేస్తారా.?
లోకేష్ : చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 32 వేల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చిన మొదటి యేడాదిలోనే పెండింగ్ ఉద్యోగాలన్నీ 5 ఏళ్లలో భర్తీ చేస్తాం. ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగాలకు యూపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్లు వదలుతారు..దానికి ప్రభుత్వ అనుమతి ఉండదు. కానీ ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాలు వదలాలంటే ప్రభుత్వ అనుమతి ఉండాలి. ఏపీపీఎఎస్సీలో అవినీతీ జరుగుతోంది. మేము అధికారంలోకి వచ్చాక ప్రతి జనవరిలో జాబ్ కేలండర్ విడుదల చేస్తాం..ఏం పోస్టులు విడుదల చేస్తున్నామో కూడా ముందుగానే చెప్తాం.
మోహన్ మురళి, పెనుమూడి, దుగ్గిరాల మండలం: రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే విద్యావ్యవస్థ ముఖ్యం..మన రాష్ట్రంలో విద్య మరుగునపడుతోంది. స్వాతంత్ర్య దినోత్సవం ఎందుకు చేసుకుంటున్నాం అంటే స్వాతంత్ర్యం వచ్చిందని మాత్రమే చెప్తున్నారు. విద్యలో రాష్ట్రానికి కీర్తి, ప్రతిష్టను తీసుకురావాలి.? మీరు వచ్చాక విద్యలో ఏం మార్పులు తీసుకొస్తారు.?
లోకేష్ : టీడీపీ వచ్చాక కేజీ టు పీజీ కరిక్యులమ్ మార్చుతాం. రాష్ట్రాన్ని చూస్తే బాదేస్తోంది. ఉద్యోగం వచ్చే సమయానికి యువతకు స్కిల్స్ లేక ఆగిపోతున్నారు. ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుంటున్నారు. విద్యలో కరిక్యులమ్ మార్చి జాబ్ రెడీ యూత్ ని తయారు చేస్తాం. యూనివర్సిటీలన్నీ రాజకీయాలకు వేధికగా మారాయి. టాప్ 100 యూనివర్సీటీల్లో గతంలో ఏపీ యూనివర్సిటీలు ఉండేవి..కానీ ఇప్పుడు లేవు. పొలిటికల్ అపాయింట్ వీసీలను తొలగిస్తాం..మంచి నిష్ణాతులైన వారినే వీసీలుగా నియమిస్తాం.
అబ్దుల్ రజాక్, తెనాలి: నేను దివ్యాంగున్ని..సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నా. టీడీపీ హయాంలో తెనాలి మార్కెట్ యార్డులో డీఈవోగా గతంలో ఉద్యోగం వచ్చింది..కానీ వైసీపీ వచ్చాక నన్ను తొలగించారు. ఉద్యోగం పోయినా నేను సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నా..మా నాన్న రిక్షా తొక్కుతారు. నాకు యార్డులో లక్ష లోన్ ఇచ్చారు..దాన్ని కూడా చెల్లిస్తున్నా. నాకు రుణాలు రాకుండా అకౌంట్ హోల్డ్ చేసి, బ్లాక్ చేయించారు. ఎమ్మెల్యే శివకుమార్ ను ఎంత బతిమాలినా వినలేదు..రుణం ఎగ్గొట్టాననే కారణంతో అరెస్ట్ వారంట్ ఇస్తున్నారు. మొన్నటి శనివారం సూసైడ్ కు ప్రయత్నించా. వికలాంగుడైన నాపైన వారు కర్కషంగా వ్యవహరిస్తున్నారు. నాలుగేళ్లుగా నోటిఫికేషన్లు కోసం ఎదురు చూస్తున్నా.
లోకేష్: 9 నెలలు ఓపిక పట్టు. యేటా జాబ్ నోటిఫికేషన్ విడుదుల చేస్తాం. పెండింగ్ పోస్టుల భర్తీ చేస్తాం. ఎన్నికల ముందు జగన్ పాదయాత్రలో కులం, మతం అతీతంగా వ్యవహరిస్తానని చెప్పాడు..కానీ వైసీపీ కాని వారిని వేధిస్తున్నారు..నచ్చని వారిని ఉద్యోగాల నుండి తొలగిస్తున్నారు.
మహాసేన రాజేష్ : టీడీపీ వచ్చాక..సంక్షేమ పథకాలు, ఫీజు రీయింబర్స్ మెంట్ ను తొలగిస్తారని ప్రచారం జరుగుతోంది..మీరు ఏం చెప్తారు?
లోకేష్ : టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు స్కూల్ ఫీజు రీయింబర్స్ మెంట్ తొలగించారా.? అన్న క్యాంటీన్, బీమా, పెళ్లికానుక, పండుగ కానుక వచ్చింది చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే. విద్యా దీవెన..వసతి దీవెన మాత్రం రద్దు చేస్తాం. గతం మాదిరే నేరుగా కాలేజీలకే ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లిస్తాం. మీకు ఇబ్బంది ఉండదు..తల్లిదండ్రులకు ఇబ్బంది ఉండదు. సమయానికి మార్క్ లిస్టులు మీ చేతికి వచ్చేలా చేసే బాధ్యత టీడీపీ తీసుకుంటుంది. వసతి, విద్యా దీవెన వల్ల 2 లక్షల మందికి సర్టిఫికేట్లు రాలేదు..దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు..టీడీపీ వచ్చాక మీకు ఆ బాధలు ఉండవు.
రమ్య, తిరువూరు : బ్రాహ్మణి గారితో పెల్లి ప్రతిపాదన మొదట ఎవరు తెచ్చారు..మీ మనసులో మొదట ఎలా రియాక్ట్ అయ్యారు.?
లోకేష్: లవ్ ఎట్ ఫస్ట్ సైట్. అమ్మా..నాన్న వచ్చి వాళ్ల అభిప్రాయం చెప్పారు..యస్ అన్నాను..బ్రాహ్మణి ఒప్పుకుంది..పెళ్లి కుదిరింది.
గంటా లహరి, ఈపూరు : ఆడపిల్లకు న్యాయం చేయలేని పదవి ఉంటే ఎంత లేకపోతే ఎంత అని డైలాగ్ ఉంది. ఈ పరిస్థితి మీకు ఎప్పుడైనా ఎదురైందా?
లోకేష్ : తల్లి, చెల్లికి న్యాయం చేయలోనేడు రాష్ట్రంలోని మహిళలకు న్యాయం ఏం చేస్తాడు.? గన్ కంటే ముందు వస్తానని సైకో జగన్ అన్నాడు. ఏపీలో ఎప్పుడూ లేనంతగా మహిళలపై దాడులు జరుగుతున్నాయి. లేని దిశ చట్టంతో ఇస్తున్నాడు. మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారు
జాహ్నవి, బాపట్ల : మీరు ఇచ్చే అసెంబ్లీలో సీట్లలో యువతకు 40 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు. ఎంతో మంది రాజకీయ నేతలు చదువుకున్నవారే ఉన్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే యువత రాజకీయాల్లోకి రాలేకపోతోంది. మీరు వచ్చాక యూనివర్సిటీల్లో ఎన్నికలు నిర్వహిస్తారా.?
లోకేష్: 40 శాతం అసెంబ్లీ స్థానాలు యువతకు కల్పించబోతున్నాం. యువతకు పిలుపిస్తున్నా..కలసి పోరాడదాం.ప్రజల కోసం ముందకు నడుద్దాం. కాలేజీ స్థాయి నుండే సమస్యలపై యువత పోరాడాలి. ఇప్పుడు ఏ మార్పు కోరుకుంటున్నామో..అదే మార్పు త్వరలో వస్తుంది. యూనివర్సిటీల్లో ఎన్నికలు పెట్టే అంశంపై చంద్రబాబుతో మాట్లాడి తప్పుకుండా నిర్వహిస్తాం.
అర్జున్, గుంటూరు : చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రాజధానికి ప్రపంచస్థాయి ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి తీసుకొచ్చారు..నేను అందులో చదువుతున్నా. దగ్గర్లోనే చదువుకుని తల్లిదండ్రులకు అందుబాటులో ఉన్నా. కానీ రోడ్లు సరిగా లేవు..బస్సులో వెళ్లి డొక్కులు గుళ్లవుతున్నాయి. మీరు అధికారంలోకి వచ్చాక రోడ్ల పరిస్థితిని పట్టించుకుంటారా.?
లోకేష్: ఒక్క రాజధానిలోనే కాదు..రాష్ట్రమంతా రోడ్లు సరిగా లేవు. టీడీపీ వచ్చాక రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం చేపడతాం. ఎస్ఆర్ఎం, విట్, అమృత్ లాంటి ప్రపంచ స్థాయి యూనివర్సిటీలు మన రాజధానిలో ఉన్నాయి..టీడీపీ వచ్చాక రాజధాని పనులు చేపట్టి మౌళిక వసతులు ఏర్పాటు చేస్తాం.
ఠాగూర్, నందిగామ: చదువకున్న యువతకు రాష్ట్రంలో అవకాశాలు చూపించడం లేదు..మీరొచ్చాక ఎలాంటి అవకాశాలు చూపిస్తారు.?
లోకేష్: టీడీపీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఏపీకి పరిశ్రమలు తెస్తాం. మాకు చిత్తశుద్ధి ఉంది. మా దగ్గర బ్రాండ్ ఉంది..దాని పేరే సీబీఎన్. 1995లో సైబరాబాద్ లో సైబర్ టవర్ కట్టి ఐటీ కంపెనీలు తెస్తే..కంప్యూటర్ అన్నం పెడుతుందా అన్నారు. హైటెక్ ఇప్పుడు తెలంగాణకు అన్నం పెడుతోంది..అది సీబీఎన్..విజనరీ అంటే. మళ్లీ ఏపీకి పరిశ్రమలు తీసుకొస్తా..20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.
మహాసేన రాజేశ్: రూ.5వేల జీతంగా ఇచ్చే వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి పార్టీ పనులు చేయించుకుంటున్నారు. మీరు మంచి ఉద్యోగాలిస్తామని చెప్తున్నారు..విదేశాలకు పంపిస్తామని అంటున్నారు. వారు విదేశాలకు వెళ్తే ఓటేయడానికి రావడం కష్టం..మీకు ఓట్లేయరనే భయం ఉండదా.?
లోకేష్: విజనరికీ..ఫ్యాక్షనిస్టుకు ఉన్న తేడా ఇది. సొంతకాళ్ల మీద నిలబడి దేశాన్ని అభివృద్ధి చేయాలని విజనరీ పాలకుడు అనుకుంటారు. కానీ ఫ్యాక్షనిస్టు మాత్రం పరిశ్రమలు రాకూడదు..వారికాళ్ల మీద నిలబడకూడదని ఆలోచిస్తారు. అందుకే యువత విజనరీ కావాలో..ఫ్యాక్షనిస్టు కావాలో నిర్ణయించుకోవాలి.
జ్యోతిక, కృష్ణాయపాలెం: ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లు 50 శాతం అమ్మకానికి పెట్టారు. టాలెంట్ ఉండి పేదరికంలో ఉన్న వాళ్లు మెడిసిన చదివే పరిస్థితి ఉండకూడదా.?
లోకేష్: ఈ ప్రభుత్వం వచ్చాక మొదటి సారి మెడికల్ సీట్లు అమ్మే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం తెచ్చిన జీవో 100 రోజుల్లోనే రద్దు చేస్తాం. పేదరికానికి కులం, మతం, ప్రాంతం ఉండదు. పేదరికం లేని రాష్ట్రం చేయడం ప్రభుత్వాలపై ఉంది.. ఆ లక్ష్యంగానే మేము పని చేస్తాం. ఈ ప్రభుత్వ వచ్చాక పేదలపై భారం మోపింది. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు, 3 సార్లు బస్సు ఛార్జీలు పెంచాడు. ధరలు, పన్నులు పెంచుకుంటూ పోతున్నాడు.
చిన్మయి, మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ : ఏపీలో స్టార్టప్స్ తగ్గిపోతున్నాయి..దీనికి మీరు ఏం పరిష్కారం చూపుతారు.?
లోకేష్: స్వయం ఉపాధి చాలా ముఖ్యం. మీరు ఎందుకు 10 మందికి ఉద్యోగాలు కల్పించే పరిస్థితిలోకి రాకూడదు. విశాఖ, తిరుపతి, అమరావతి, కర్నూలు కేంద్రంగా ఇంక్యుబేషిన్ ఏర్పాటు చేశాం. మా ప్రభుత్వం వచ్చాక మార్కెట్ లింకేజీ ఏర్పాటు చేసి స్టార్టప్స్ కు ప్రోత్ససాహం అందిస్తాం.
భవ్యేష్, నిమ్మకూరు: గత ప్రభుత్వంలో చంద్రబాబు బీటెక్ కాలేజీలు నిర్మించారు..ప్రోత్సహించారు. ఉద్యోగాల కోసం హైటెక్ సిటీ నిర్మించారు. రాష్ట్రంలో బీటెక్ సీట్లు 1.50 లక్షలున్నాయి..లక్ష సీట్లు మాత్రమే ఫిల్ అయ్యాయి. ఎంటెక్ ప్రవేశాలు కూడా తగ్గిపోయాయి. స్టాండర్ట్ ఎడ్యుకేషన్ ను ఎలా బిల్డ్ చేస్తారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించారు..మీరొచ్చాక పేరు మళ్లీ పెడతారా.?
లోకేష్: ఇంజనీరింగ్ సీట్లు ఫిల్ అవ్వలేదంటే కారణం రాష్ట్రంలో మెరుగైన అవకాశాలు లేకపోవడమే. ఏపీలో పెట్టుబడులు పెట్టిన పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. రాష్ట్రంలో ఎక్కువ పన్ను కట్టే అమరరాజా కంపెనీని తెలంగాణకు తరిమాడు. విశాఖలో ఏర్పాటు చేసిన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ను కూడా తెలంగాణకు తరిమారు. ఇందువల్లే అవకాశాలు లేక యువత పక్కరాష్ట్రాలకు వెల్లిపోతోంది. ఏపీకి పూర్వవైభవం తీసుకొచ్చి…పరిశ్రమలు తీసుకొస్తాం. పక్కరాష్ట్ర యువత చూపు ఏపీ వైపు మళ్లిస్తాం. 1983లో ఎన్టీఆర్ సీఎం అయ్యాక హెల్త్ యూనివర్సిటీలు లేవు. తన స్నేహితులకు చెందిన మెడికల్ కాలేజీని వారితో ఒప్పించి ప్రభుత్వంలో కలిపేలా చేశారు ఎన్టీఆర్. అందుకే దానికి చంద్రబాబు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పేరుపెట్టారు. రాజశేఖర్ రెడ్డి వచ్చాక డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెట్టారు. కానీ సైకో వచ్చాక పేరు మార్చారు. టీడీపీ వచ్చాక మళ్లీ హెల్త్ యూనిర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెడతాం.
మహాసేన రాజేశ్ : ఎన్టీఆర్ మనవడిగా మీరు సినీ ఫీల్డ్ లోకి వెళ్లలేదు. కానీ సంక్లిష్టమైన పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చారు. మీ తల్లిన అసెంబ్లీ సాక్షిగా దూషించినప్పుడు, మిమ్మల్ని ఎటాక్ చేసినప్పుడు మీరు ఎలా ఆలోచించారు.?
లోకేష్: ఈ ప్రభుత్వంలో అందరం అనేక సందర్భాల్లో అవమానాలు ఎదర్కొన్నవాళ్లమే. నమ్ముకున్న సిద్ధాంతం కోసం పోరాడాలి. నేను నమ్ముకున్న సిద్ధాంతం..అన్ని రంగాల్లో ఏపీ నెంబర్ 1 గా నిలబెట్టడంప్రజలు గర్వపడేలా ఏపీని అభివృద్ధి చేస్తా. ప్రజా సేవకు వస్తాను..మార్పుకోసం నేను పోరాడాలని చదువుకునేటప్పుడే నిర్ణయించుకున్నా. మా అమ్మను అవమానించిన ఘటనే నాలో కసిని పెంచింది. నన్ను ఎంత ఎగతాళి చేస్తే నాలో అంత కసి పెరుగుతుంది. నా తల్లి జోలికి వస్తే తోలు వలుస్తా. రాష్ట్రంలోని తల్లులందరికీ చెప్తున్నా..అసెంబ్లీలో నా తల్లిని అవమానించిన వారిని వదిలిపెట్టను.
బాలూ నాయక్, మాచర్ల : ఏపీ యూనివర్సిటీల్లో ర్యాంకిగ్స్ పడిపోయింది. యూనివర్సిటీల్లో విద్యా నాణ్యత తగ్గింది. యూనివర్సిటీలకు మళ్లీ పూర్వవైభవం రావడానికి మీరేం చర్యలు తీసుకుంటారు.?
లోకేష్: చంద్రబాబు ఉన్నప్పుడ యూనివర్సిటీలకు మంచి వీసీలను నియమించాం. యూనివర్సిటీ అలూమ్నీని కూడా బోర్డులో నియమించాం. కానీ వీసీ పోస్టులను ఈ ప్రభుత్వం బేరంపెట్టి అమ్మేస్తోంది. అందుకే యూనివర్సిటీల్లో రేటింగ్ పడిపోయింది. కానీ సైకో మాత్రం ఆక్స్ ఫర్డ్ లాగా తీర్చిదిద్దుతానని చెప్తున్నారు. టీడీపీ వచ్చిన వెంటనే యూనివర్సిటీలకు పూర్వవైభవం తీసుకొచ్చి..మౌళిక వసతులు కల్పిస్తాం.
హర్షసాయి, వేమూరు : స్కూళ్ల విలీనం కార్యక్రమంతో 4 లక్షల మంది విద్యార్థులు చదువుకు దూరమ్యారు. తల్లిదండ్రులు ఇబ్బందులు పుడుతున్నారు. మద్యతరగతి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. మీరొచ్చాక డిగ్రీ విద్యార్థులకు ఏం న్యాయం చేస్తారు?
లోకేష్: డిగ్రీ చదివిన వారికి కూడా ఉద్యోగాలివ్వాలని ఆనాడు నిర్ణయించాం. ఫాక్స్ కాన్ లో 15 వేల మంది మహిళలకు ఉధ్యోగాలు కల్పించాం. మళ్లీ టీడీపీ వచ్చిన వెంటనే మ్యానిఫ్యాక్చరింగ్ ను ప్రోత్సహించి ఉద్యోగాలు కల్పిస్తాం. ఈ ప్రభుత్వం వచ్చాక ఫీజు రీయింబర్స్ మెంట్ సరిగా చెల్లించక నిరుపేద కుటుంబాలకు భారంగా మారింది. పాత ఫీజు రీయింబర్స్ మెంట్ విధానం అమలు చేస్తాం. సర్టిఫికేట్లు రాని 2 లక్షల మందికి వన్ టైం సెటిల్ మెంట్ కింద సర్టిఫికేట్లు అందిస్తాం.
రామానుజ, ఎన్ఆర్ఐ కాలేజీ : మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు..మీరు పాదయాత్రకు వెల్లడానికి ముందు మీ ఫ్రెండ్ తో చర్చించారా?
లోకేష్: నా పుట్టిన రోజు జనవరి 23..ఆరోజు మాత్రం స్నేహితులతో పాదయాత్ర చేస్తున్నానని చెప్పా. పాదయాత్ర తర్వాత వస్తానని చెప్పా. నా కుటుంబాన్ని, మిత్రలను కొన్ని రోజులు దూరమవుతున్నా. నా పాదయాత్ర పూర్తయ్యాక వాళ్లను కలుస్తా.
ప్రవళిక, కాకుమాను : వ్యవసాయానికి చాలా మంది దూరంగా వెళ్తున్నారు. బీటెక్ అయ్యాక చాలా మంది ఫారెన్ వెళ్తున్నారు..ఏపీని ఎప్పుడు ఐటీ హబ్ గా మార్చుతారు?
లోకేష్ : వ్యవసాయంలో మార్పులు తీసుకురావాలి. ప్రపంచానికి అవసరమైన వాటిని ప్రవేశపెడితేనే వ్యవసాయంలో లాభాలు వస్తాయి. చంద్రబాబు అరటిని ఎక్కువగా ప్రోత్సహించారు. యువతను వ్యవసాయంలో ప్రోత్సహిస్తాం. విశాఖను ఐటీ హబ్ గా మార్చడానికి ప్రయత్నించాం. కానీ సైకో వచ్చాక ఐటీ రంగాన్ని విస్మరించారు. గ్లోబల్ సమ్మిట్ అని మీటింగ్ పెట్టుకున్నాడు తప్ప..పెట్టుబడులు రాలేదు. మన రాష్ట్రంలోనే యువతకు ఐటీ ఉద్యోగాలు కల్పిస్తాం.
శ్రావ్య: మొదటి వంద రోజుల్లో విద్యలో మీరు తీసుకొచ్చే మార్పులు ఏంటి.?
లోకేష్: పరిశ్రమల గురించే మాట్లాడితే మంత్రి కోడిగుడ్డు, పొదగాలి అని మాట్లాడుతున్నారు. టీడీపీ వచ్చిన వెంటనే గతంలో మంచిగా పని చేసిన పాలసీలు అమలు చేస్తాం. ప్రపంచలోనే ఉన్న మంచి పాలసీలను ఏపీలో అమలు చేస్తాం. మొదటి వంద రోజుల్లో విశాఖకు ఐటీ కంపెనీలు తీసుకొస్తాం. కేజీ నుండి పీజీ వరకు కరిక్యులమ్ మార్చుతాం. స్కూల్ విద్యలోనే మార్పులు తీసుకొస్తాం.
యువ మహిళా న్యాయవాది: రాష్ట్రంలో న్యాయవాదులను చంపేస్తున్నారు..మీరొచ్చాక న్యాయ వాదులకు ఏం చేస్తారు?
లోకేష్: టీడీపీ వచ్చాక 420, రౌడీలకు భయం వస్తుంది. టీడీపీ వస్తే దాడులు, హత్యలు ఆగిపోతాయి. న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం.
ప్రతాప్, గుంటూరు : నేను ఓ ప్రైవేట్ కాలేజీలో ఫ్యాకల్టీగా పని చేస్తున్నా. యువతలో మీపై కొన్ని ఆశలున్నాయి. యువతను ఈ ప్రభుత్వం తట్టుకోలేని బాధల్లోకి నెట్టింది. బీటెక్ చేరిన తర్వాత వేలాది మంది విదేశీ విద్యతో బయట దేశాలకు వెల్లి చదివారు..ఇప్పుడు ఎత్తేశారు. పీజీ వాళ్లకు రీయింబర్స్ మెంట్ ఎత్తేశాడు. ఒక్క రోజుకు తీసుకోవాల్సిన జీతం..నెల పని చేస్తే ఇస్తున్నాడు ఈ సీఎం. యువతకు మీరు ఏం భరోసా ఇస్తారు.?
లోకేష్: టీడీపీకి 175 స్థానాలు ఇవ్వండి..ఎవరైతే పెట్టుబడి పెట్టాలనుకుంటారో వారికి భరోసా వస్తుంది. విదేశీ విద్య, పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ అధికారంలోకి రాగానే ఇస్తాం. అన్ని రంగాల్లో రాష్ట్రంలో చంద్రబాబు విత్తనాలు వేశారు..అవి ఫలిస్తాయి. టీడీపీ వచ్చాక పరిశ్రమలు తీసుకొచ్చి..ఉద్యోగాలు కల్పిస్తాం.
సుదర్శన్: బైక్ పై ముగ్గురం వెళ్తుంటే రైడ్ కు వెళ్తున్నారని పోలీసులు ఫైన్లు వేస్తున్నారు..కొడాలి నాని లాంటి వాళ్లు వందలాది లారీలు అక్రమంగా రోడ్లపై తిప్పుతున్నారు..వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు.?
లోకేష్: చట్టాలు గౌరవించే వారిపైనే ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పోలీసులను ఈ ప్రభుత్వం ఫోటో గ్రాఫర్లుగా మార్చింది. వైసీపీ వాళ్లు అక్రమంగా వాహనాలు నడిపితే చర్యలు లేవు. టీడీపీ వచ్చాక అందరికీ సమానంగా చట్టాలు అమలు చేస్తాం. యువత ఏం కోరుకుంటుందో నాకు అర్థమైంది. అనుభవం లేని వ్యక్తి, సైకో సీఎం అయితే రాష్ట్రం ఎలా ఉంటుందో ప్రస్తుతం చూస్తున్నాం. 2024లో మన ప్రయాణం మైనస్ నుండి ప్రారంభం అవుతుంది. ఈ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే ఇక బైబై ఏపీ అని అనాల్సి వస్తుంది. పరిశ్రమలు పక్కరాష్ట్రాలకు పోతాయి. 2024లో మీరు చంద్రబాబును సీఎం చేయాలి…అప్పుడే దారి తప్పిన రాష్ట్రం గాడిలో పడుతుంది. అనుభవం ఉన్న వ్యక్తి సీఎం అయితేనే రాష్ట్రం బాగుంటుంది. 2047 విజన్ ను చంద్రబాబు ఇచ్చారు..అందులో ఏపీ బాగస్వామ్యం అవుతుంది. టీడీపీ అధికారంలోకి వస్తుంది..యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం.
Also Read this Blog: Uniting the State: Naralokesh’s Padayatra Mission
Tagged:#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh