NaraLokesh padayatra,Yuvagalam
NaraLokesh padayatra,Yuvagalam

మంగళగిరి నియోజకవర్గంలో దుమ్మురేపిన యువగళం అడుగడుగునా యువనేతకు నీరాజనాలు పట్టిన జనం

నేడు డాన్ బాస్కో స్కూలు వద్ద యువతతో హలో లోకేష్

మంగళగిరి: రాష్ట్రంలో అంతమొందించడమే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్న యువనేత Nara Lokesh కు సొంత అసెంబ్లీ నియోజకవర్గం మంగళగిరిలో అపూర్వ ఆదరణ లభించింది. 185వరోజు యువగళం పాదయాత్ర  నిడమర్రు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభం కాగా, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయజెండాను చేతబట్టి యువగళం రథసారధి నారా లోకేష్ ఫ్రీడమ్ వాక్ లో పాల్గొన్నారు. ఆయనకు సంఘీభావంగా వేలాది ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు మువ్వన్నెల జెండాలతో పాదయాత్రలో పాల్గొన్నారు. మంగళగిరి పట్టణంలో యువగళం పాదయాత్ర దుమ్మురేపింది. అడుగడగునా మహిళలు యువనేతకు దిష్టితీస్తూ, హారతులిస్తూ నీరాజనాలు పట్టారు. లోకేష్ పాదయాత్రకు సంఘీభావంగా భారీగా మంగళగిరి ప్రజలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. భారీ గజమాలతో నాయకులు, కార్యకర్తలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. రైల్వే గేట్ వద్ద ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. గజమాలలు, సంప్రదాయ నృత్యాలతో హోరెత్తించారు. లోకేశ్ పాదయాత్ర మంగళగిరి గౌతమబుద్ధ రహదారి కిటకిటలాడింది. యువనేతను చూసేందుకు జనం పెద్దఎత్తున రోడ్లవెంట బారులుతీరారు. యువనేతతో ఫోటోలు దిగేందుకు యువతీయువకులు పోటీపడ్డారు. యువనేత పాదయాత్రతో మంగళగిరి ప్రధాన రహదారి జనసంద్రంగా మారింది. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు వింటూ లోకేష్ ముందుకు సాగారు. నిడమర్రు శివారు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర… బేతపూడి బాపూజీనగర్, మంగళగిరి రైల్వేగేట్, మార్కెట్ యార్డు, పాతబస్టాండు, మున్సిపల్ ఆఫీసు, ఆర్టీసి బస్టాండు, నవులూరు రోడ్డు మీదుగా యర్రబాలెం డాన్ బాస్కో స్కూలు వద్ద విడిది కేంద్రానికి చేరుకుంది. 185వరోజు యువనేత నారా లోకేష్ 10.3 కి.మీ.ల మేర పాదయాత్ర సాగించారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2486.3 కి.మీ.ల మేర పూర్తయింది. యువగళంలో భాగంగా బుధవారం సాయంత్రం యర్రబాలెం డాన్ బాస్కో స్కూలు వద్ద యువతతో హలో లోకేష్ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నాను.

పదవీకాలం ముగుస్తున్నా స్టిక్కర్ల బతుకేనా…

అభివృద్ధి అంటే రంగులు వేసుకోవడమేనా?!

నిడమర్రులో టిడ్కో గృహాల వద్ద సెల్ఫీ దిగిన లోకేష్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇవి రాజధాని పరిధిలోని నిడమర్రులో పేదలకోసం గత టిడిపి ప్రభుత్వం నిర్మించిన టిడ్కో గృహాలు. పేదలకు కొత్తగా ఇళ్లు కట్టడం చేతగాని మేం నిర్మించిన ఇళ్లకు మాత్రం వైసిపి రంగులేసుకున్నారు. నాలుగేళ్ల వైసిపి పాలనలో చేసిందేమైనా ఉంది అంటే అది స్టిక్కర్లు వేసుకోవడమే. కూల్చివేతలు మినహా పదవీకాలం ముగిసే లోపు ప్రజలకోసం నేను ఫలానా మంచి పని చేశానని ఒక్కటైనా చూపించగలరా? మేము కట్టిన టిడ్కో ఇళ్ల దగ్గర కనీసం మౌలిక వసతులు కల్పించడం జగన్ ప్రభుత్వానికి చేతకాలేదని యువనేత లోకేష్ దుయ్యబట్టారు.

విజనరీ పాలనకు “అమృత”  సాక్ష్యం!

అమరావతిలోని అమృత యూనివర్సిటీ వద్ద సెల్ఫీ దిగిన లోకేష్ జగన్ ప్రభుత్వంపై వాగ్బాణాలు సంధించారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఉన్నత విద్యకోసం పొరుగురాష్ట్రాల బాట పట్టకూడదన్న ఉద్దేశంతో జాతీయస్థాయిలో పేరెన్నికగన్న అమృత విశ్వవిద్యాలయాన్ని గత ప్రభుత్వంలో అమరావతికి తీసుకొచ్చాం. దీంతోపాటు విట్, ఎస్ఆర్ఎం లాంటి ప్రఖ్యాత విద్యాసంస్థలను కూడా ఆనాడు రాష్ట్రానికి రప్పించాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ విద్యాలయాలకు వెళ్లేందుకు కనీసం రహదారి సౌకర్యం లేకుండా రోడ్డును తవ్వేసి విద్యార్థులను ఇబ్బందుల పాల్జేస్తున్నాడు. విధ్వంసమే ఎజెండాగా సాగుతున్న జగన్ ఏలుబడిలో రాష్ట్రంనుంచి వెళ్లిపోవడమే తప్ప కొత్తగా ఒక్క పరిశ్రమగానీ, విద్యాసంస్థగానీ వచ్చింది లేదు. విజనరీ పాలనకు, విధ్వంసకుడి అరాచకానికి సాక్షీభూతంగా నిలుస్తోంది ప్రజా రాజధాని అమరావతి అని లోకేష్ వ్యాఖ్యానించారు.

తొలిరోజే మంగళగిరిలో యువగళం ప్రకంపనలు

భారీగా వైసిపినుంచి టిడిపిలోకి చేరికలు

మంగళగిరి: మంగళగిరి నియోజకవర్గంలో యువనేత నారా లోకేష్ పాదయాత్ర అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. యువనేత లోకేష్ నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన తొలిరోజే పెద్దఎత్తున వైసిపి నాయకులు ఆపార్టీని వీడి టిడిపిలో చేరారు. మంగళగిరి నియోజకవర్గం నిడమర్రు క్యాంప్ సైట్ లో  వైసిపి నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలకు లోకేష్ పసుపుకండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 500కుపైగా కుటుంబాలు టిడిపిలో చేరాయి. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ… ఎమ్మెల్యే ఆర్కే తమను స్వార్థ ప్రయోజనాలకోసం వాడుకొని, ఎటువంటి గుర్తింపు ఇవ్వకుండా గాలికొదిలేశాడని తెలిపారు. అక్కడ తమకు ఎటువంటి గుర్తింపు లేకపోవడంతో నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయామని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం తామంతా యువనేత లోకేష్ సారధ్యంలో పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు వారు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ

వైసీపీ స్వార్ధపూరిత రాజకీయాలకు వందలాది కుటుంబాలు బలయ్యాయని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో పసుపుజెండా ఎగరేయడానికి ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని కోరారు. 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని, అన్నివర్గాలకు సమన్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పేద, బడుగు, బలహీన వర్గాల పక్షాన తెలుగుదేశంపార్టీ  ఎల్లప్పుడూ నిలబడుతుందని అన్నారు.  నాయకులు, కార్యకర్తలకు తగిన ప్రాధాన్యతనిచ్చి అన్నివిధాలా అండగా నిలుస్తామని భరోసానిచ్చారు. వైసీపీని వీడి తెలుగుదేశంపార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరినీ ప్రత్యేకంగా అభినందించారు.

నిడమర్రు గ్రామానికి చెందిన వైసీపీ కీలక నేత గాదె లక్ష్మారెడ్డి, వారి అనుచరులు, చినకాకానికి చెందిన మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ సుంకర రఘుపతిరావు, పెదవడ్లపూడి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు నాగళ్ల శీధర్, కురగల్లు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు తోట శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పెద్దఎత్తున వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరారు. పార్టీలో చేరిన వారిలో మంగళగిరి మండలం నిడమర్రు గ్రామానికి చెందిన 100కుటుంబాలు, చినకాకాని గ్రామానికి చెందిన 100కుటుంబాలు, పెదవడ్లపూడి గ్రామానికి చెందిన 100 కుటుంబాలు, కురగల్లు గ్రామానికి చెందిన 150కుటుంబాలు, నీరుకొండ కు చెందిన 20 కుటుంబాలు, బేతపూడి కి చెందిన 10 కుటుంబాలు, మంగళగిరి 28 వ వార్డు కి చెందిన 20 కుటుంబాలు ఉన్నాయి.

నారా లోకేష్ ను కలిసిన దుగ్గిరాల పసుపురైతులు

మంగళగిరి నియోజకవర్గం నిడమర్రు సెంటర్ లో దుగ్గిరాలకు చెందిన పసుపు రైతులు నారా లోకేష్ ను కలిసి వినతిపత్రం అందించారు. గతంలో దేశవాళీ టేకూరిపేట రకం విత్తన పంటకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉండి, రైతులు, వ్యాపారులకు లాభదాయకంగా ఉండేది. కాలక్రమంలో ఆ రకం పంట అంతరించి, పసుపుపంట విస్తీర్ణం కూడా తగ్గిపోయింది. సేలంరకం పసుపువిత్తనాలు మాకు అందుబాటులోకి తెచ్చినట్లయితే ఇతర రాష్ట్రాల మాదిరిగా మాకు గిట్టుబాటు ధరలు లభించే అవకాశం ఉంది. గతంలో హార్టికల్చర్ శాఖ తరపున హెక్టారుకు రూ.12500 సబ్సీడీ అందించేవారు. 2020లో తర్వాత ఎటువంటి రాయితీలూ రావడం లేదు. ఆర్బీకేల్లో వైసీపీకి అనుకూలంగా ఉన్నవారి పంటలు మాత్రమే నమోదు చేస్తున్నారు. ఈ-నామ్ టెండర్ విధానం వల్ల రైతులు అవగాహనలేక పసుపును మార్కెట్ యార్డ్ కు తీసుకురావడం లేదు. ఓపెన్ ఆప్షన్ లేకపోవడంతో దళారుల ప్రమేయంతో పసుపు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో దుగ్గిరాలలో 12వరకు పసుపు పరిశ్రమలు ఉండేవి. ప్రస్తుతం సరిగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో యంత్రసామాగ్రి దెబ్బతిని, కేవలం నాలుగైదు యూనిట్లు మాత్రమే నడుస్తున్నాయి. మీరు అధికారంలోకి వచ్చాక మా సమస్యలు పరిష్కరించండి.

నారా లోకేష్ స్పందిస్తూ

వ్యవసాయంపై అవగాహన లేని ముఖ్యమంత్రి కారణంగా రాష్ట్రంలో రైతాంగం నానా అగచాట్లు పడుతున్నారు. రైతులకు అవసరమైన విత్తనాలను కూడా సరఫరా చేయకపోవడం ఈ ప్రభుత్వ దివాలాకోరు తనానికి అద్దం పడుతోంది. టిడిపి అధికారంలోకి వచ్చాక పసుపుపంటకు హార్టికల్చర్ సబ్సిడీలను అందిస్తాం. రైతులు కోరుకుంటున్న విధంగా సేలం రకం విత్తనాలను అందుబాటులోకి తెస్తాం. నాణ్యమైన విద్యుత్ తోపాటు పసుపు పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తాం. మెరుగైన మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటుచేసి రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా చర్యలు తీసుకుంటాం.

నారా లోకేష్ ను కలిసిన మంగళగిరి మహిళలు

మంగళగిరి రైల్వేగేటు వద్ద నియోజకవర్గ మహిళలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇటీవల మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. మహిళల రక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. చదువుకునే ఆడపిల్లలు, యువతులకు ప్రత్యేక హాస్టల్స్ ఏర్పాటు చేయాలి. నిరుద్యోగ యువతులకు ఉద్యోగాలు కల్పించి, నిరక్షరాస్యులకు ఉపాధి కల్పించాలి. ఒంటరి మహిళా ఫించన్లు అమలు చేయాలి. మద్యాన్ని నియంత్రించి, గంజాయి విక్రేతలపై చర్యలు తీసుకోవాలి. మహిళలు సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.  మంగళగిరిలో జరుగుతున్న స్త్రీశక్తి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి. పరిశ్రమల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి.  నిత్యవసర సరుకుల ధరలు, గ్యాస్ ధరలను అదుపుచేయాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ

వైసీపీ అధికారంలోకి వచ్చాక మహిళలకు రక్షణ కరువైంది. శాంతిభద్రతల నిర్వహణలో వైసీపీ ప్రభుత్వ ఘోర వైఫల్యం కారణంగా మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడులు నిత్యకృత్యమయ్యాయి. నాలుగేళ్లలో మహిళలపై 52,587 నేరాలు జరిగాయి. ప్రతి గంటకు రెండు నేరాలు నమోదవుతూ మహిళల భద్రత గాలిలో దీపంగా మారింది. సీఎం ఇంటి సమీపంలో అత్యాచారం జరిగినా గ్యాంగ్ రేప్ జరిగిన ఈ ముఖ్యమంత్రికి పట్టడం లేదు. TDP వచ్చాక ఆడపిల్లల వైపు కామాంధులు కన్నెత్తి చూడాలంటేనే భయపడేలా చేస్తాం. గంజాయి సరఫరా దారులు, విక్రేతలపై ఉక్కుపాదం మోపుతాం.  మహాశక్తి కార్యక్రమం అమలుద్వారా మహిళలకు ఆర్థిక చేయూతనిస్తాం.  నిత్యావసర వస్తువుల ధరలను అదుపులోకి తెచ్చి, ప్రతిఏటా 3 గ్యాస్ సిలెండర్లను ఉచితంగా అందిస్తాం. మహిళలకు ప్రత్యేక రాయితీలను అందజేసి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం.

నారా లోకేష్ ను కలిసిన మంగళగిరి ముస్లింలు

మంగళగిరి పాతబస్టాండు వద్ద ముస్లిం మైనారిటీలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రంజాన్, బక్రీద్ పండుగల రోజున ప్రార్థనలు చేసుకోవడానికి స్థలాలు సరిపోవడం లేదు.  స్మశాన వాటికకు కూడా స్థలం సరిపోక ఇబ్బందులు పడుతున్నాం. ప్రార్థన స్థలాలు, స్మశానం, కమ్యూనిటీ హాలు, షాదీఖానాల కోసం 5 ఎకరాల స్థలం కేటాయించాలి. ముస్లింలు ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నారు..చేతివృత్తులు, ఇతర వ్యాపారాలు చేసుకోవడానికి ఆర్థిక సాయం అందించాలి. ముస్లింలు వ్యాపారాలు చేసుకోవడానికి షాపింగ్ కాంప్లెక్స్ లు నిర్మించాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ

ముస్లిం మైనారిటీల ఆస్తులపై ఉన్న శ్రద్ధ… వారి సంక్షేమంపై లేదు. వైసిపి అధికారంలోకి వచ్చాక వేలకోట్ల రూపాయల వక్ఫ్ బోర్డు ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయి. మసీదు ఆస్తుల పరిరక్షణ కోసం ప్రయత్నించిన ఇబ్రహీంను నర్సరావుపేటలో దారుణంగా నరికిచంపారు. టిడిపి అధికారంలోకి రాగానే మంగళగిరిలో ముస్లింలు కోరిన విధంగా 5ఎకరాల స్థలం కేటాయిస్తాం. ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటుద్వారా ముస్లింలకు సబ్సిడీ రుణాలు అందజేసి ఆర్థిక చేయూతనిస్తాం. మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లలో ముస్లింలకు షాపులకు కేటాయిస్తాం.

యువనేతను కలిసిన కృష్ణబలిజ సంక్షేమసంఘం ప్రతినిధులు

మంగళగిరి మున్సిపల్ ఆఫీసు వద్ద ఎపి కృష్ణబలిజ సంక్షేమ సంఘం ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో కృష్ణబలిజ కులస్తులు అన్ని రంగాల్లో వెనుకబడ్డారు. సంచారజాతులుగా పిలువబడుతున్న మేం అభివృద్ధి దూరంగా ఉన్నాం. ఆర్థికంగా వెనుకబడటంతో పాటు అన్నివిధాలా మేం అన్యాయానికి గురయ్యాం. 1970లో అనంతరామన్ కమిషన్ మా కులాలపై సరైన రిపోర్టును ఇవ్వకుండా అన్యాయం చేసింది. బిసీ(డి) గ్రూపు 15వ వరుసలో మా జాతులను చేర్చడంతో తీవ్రంగా నష్టపోయాం. మీరు అధికారంలోకి వచ్చాక మా జాతులకు న్యాయంచేయండి.

నారా లోకేష్ స్పందిస్తూ

వైసీపీ అధికారంలోకి వచ్చాక వెనుకబడిన వర్గాలను తీవ్ర నిర్లక్ష్యం చేశారు. కులానికొక కుర్చీలేని బిసిలకు మాత్రమే ఖర్చుచేయాల్సిన రూ.75,790 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే సంచార జాతులుగా ఉన్న కృష్ణబలిజ కులస్తుల ఆర్థిక స్వావలంబనకు చేయూతనిస్తాం. సబ్సిడీ రుణాలను అందజేసి చిరువ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పిస్తాం. బిసి జనగణన ద్వారా ఆయా వర్గాల జనాభాను గుర్తించి తగువిధంగా న్యాయం చేస్తాం. అధికారంలోకి వచ్చాక ఇల్లులేని వారికి పక్కాగృహాలు నిర్మించి ఇస్తాం.

లోకేష్ ను కలిసిన టూవీలర్ మెకానిక్ వర్కర్స్ ప్రతినిధులు

మంగళగిరి నవులూరు రోడ్డులో టూవీలర్ మెకానిక్ వర్కర్స్ అసోసియేషన్ ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో 8లక్షల మంది టూవీలర్ మెకానిక్ లు ఉన్నారు. అందరికీ గుర్తింపు కార్డులివ్వాలి. టూవీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలి. గుర్తింపుకార్డు ఉన్న ప్రతి మెకానిక్ కి ప్రమాద బీమా, వైద్య సదుపాయం అందించాలి. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మెకానిక్ లకు శిక్షణ ఇప్పించాలి. మెకానిక్ లు స్వయం ఉపాధి ద్వారా నిలదొక్కుకునేందుకు అవసరమైన ఆర్థిక చేయూతనందించాలి. కార్మికశాఖ ద్వారా గుర్తింపుపొందిన, లైసెన్స్ ఉన్న ప్రతి మెకానిక్ కు సబ్సిడీ రుణాలు రూ.3లక్షలు అందించాలి. 55ఏళ్లు దాటిన పేద మెకానిక్ లకు వెల్ఫేర్ బోర్డు ద్వారా నెలకు రూ.5వేలు పెన్షన్ ఇవ్వాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్నివర్గాల మాదిరిగానే ఆటోమొబైల్ రంగం కూడా కుదేలైంది. పెరిగిన పెట్రోలు ధరలతో టూవీలర్స్ అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయి, మెకానిక్ లకు పనిలేకుండా పోయింది. టిడిపి అధికారంలోకి వచ్చాక అధునాతన వాహనాలపై మెకానిక్ లకు శిక్షణ ఇచ్చి, ఉచితంగా టూల్ కిట్స్ అందజేస్తాం. ప్రతి మెకానిక్ కు గుర్తింపు కార్డు అందజేసి, ప్రమాద బీమా,వైద్యబీమా సౌకర్యం కల్పిస్తాం. సొంతంగా మెకానిక్ షాపులు పెట్టుకునేవారికి సబ్సిడీ రుణాలు అందజేస్తాం.

లోకేష్ ను కలిసిన గుంటూరు జిల్లా సర్పంచులు

నిడమర్రు క్యాంప్ సైట్ లో ఉమ్మడి గుంటూరు జిల్లా సర్పంచ్ లు యువనేత లోకేష్ ను కలిసి వినతిత్రం సమర్పించారు.  ప్రభుత్వం కొల్లగొట్టిన 14, 15 ఆర్ధిక సంఘం నిధులు తిరిగి ఇప్పించేలా చొరవ తీసుకోవాలని కోరారు. పంచాయతీ రాజ్ శాఖా మంత్రిగా లోకేష్ తీసుకొచ్చిన ఎన్నో సంస్కరణలను వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని అన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక పంచాయతీల అభివృద్ధిపై మ్యానిఫెస్టో పొందుపర్చాలని కోరారు. సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల కుటుంబ సభ్యులకు ఏడాదిలో ఒక రోజు తిరుమల బ్రేక్ దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

యువనేత లోకేష్ మాట్లాడుతూ…

పంచాయితీల అభివృద్ధికి అదనపు నిధులు ఇవ్వకపోగా, పంచాయితీలకు ఫైనాన్స్ కమిషన్ లు ఇచ్చిన 9వేల కోట్లను జగన్ ప్రభుత్వం దొంగిలించడం దారుణమని అన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పంచాయితీలకు రాష్ట్రప్రభుత్వం తరపున అదనపు నిధులు కేటాయించి, గతవైభవం తెస్తామని చెప్పారు. తమ హక్కుల కోసం పోరాడుతున్న సర్పంచ్ లకు లోకేష్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

Also Read this Blog: People’s Voice on the Move: Naralokesh’s Padayatra Experience

Tagged:#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *