మంగళగిరి నియోజకవర్గంలో కదంతొక్కిన యువగళం దారిపొడవునా యువనేతకు నీరాజనాలు పట్టిన జనం
నేడు పాదయాత్రకు విరామం, 19న విజయవాడలోకి ప్రవేశం
మంగళగిరి: అంతమొందించడమే లక్ష్యంగా యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయత్ర 187వరోజు మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో కదంతొక్కింది. సొంతగడ్డపై యువనేత లోకేష్ తన నియోజకవర్గ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి సమస్యలు వింటూ ముందుకు సాగారు. యర్రబాలెం క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైన యువనేత పాదయాత్రకు అడుగడుగునా జనం నీరాజనాలు పట్టారు. భారీ గజమాలలు, హారతులతో స్వాగతించారు. పాదయాత్ర దారిలో వివిధ వర్గాల ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను యువనేతకు విన్నవించారు. కృష్ణానది చెంతనే ఉన్నా ఇసుక దొరకడంలేదని, విద్యుత్ ఛార్జీల భారం మోయలేనివిధంగా తయారైందని ఆవేదన వ్యక్తంచేశారు. యర్రబాలెం నుంచి ప్రారంభమైన పాదయాత్ర… డోలాస్ నగర్, ప్రకాష్ నగర్, నులకపేట, సాయిబాబా గుడి, సలామ్ సెంటర్, గేట్ సెంటర్, ఎన్టీఆర్ విగ్రహం, అంబేద్కర్ విగ్రహం, ఉండవల్లి సెంటర్ మీదుగా కరకట్ట వద్ద చంద్రబాబునాయుడు గారి నివాసం వద్ద విడిది కేంద్రానికి చేరుకుంది. 187వరోజు యువనేత లోకేష్ 10.2 కి.మీ.ల పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2496.5 కి.మీ.ల మేర పూర్తయింది. యువగళం పాదయాత్రకు 18వతేదీన తాత్కాలిక విరామం ప్రకటించారు. 19వతేదీ సాయంత్రం తమ నివాసం నుంచి యాత్ర ప్రారంభించి, ప్రకాశం బ్యారేజి మీదుగా విజయవాడ నగరంలోకి అడుగుపెడతారు.
టీడీపీలోకి కొనసాగుతున్న చేరికల పర్వం వైసీపీని వీడుతున్న మంగళగిరి కీలక నేతలు
లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిన 300పైగా కుటుంబాలు
యర్రబాలెం(తాడేపల్లి) : మంగళగిరిలో వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. కీలక నేతలంతా వైసీపీకి రాజీనామా చేసి TDP లో చేరుతున్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా…గురువారం డాన్ బాస్కో స్కూల్ వద్ద విడిది కేంద్రంలో పలువురు వైసీపీ నేతలు లోకేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నిడమర్రు గ్రామానికి చెందిన పాములపాటి వీరశివారెడ్డి, తాడేపల్లికి చెందిన సూరెడ్డి వెంకటరెడ్డి, కె.నాగేశ్వరావు టీడీపీ కండువా కప్పుకున్నారు. నవులూరుకు చెందిన ఏపూరి సురేష్ నాయుడు, పంచల సువార్త, వేమూరు ప్రణయ్, యర్రబాలెం గ్రామానికి చెందిన దూళ్ల శేషు గోపయ్య వీరితో పాటు మంగళగిరి పట్టణానికి చెందిన 13వార్డు, తాడేపల్లిలోని 2, 5, 7, 23వ వార్డులు, నవులూరు, కృష్ణాయపాలెం,యర్రబాలెంకు చెందిన సుమారు 300పైగా కుటుంబాల వారు చేరారు. వీరందరికీ లోకేష్ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
విధి పగబడితే లోకేషన్న దారిచూపాడు
యువనేత రాకతో రెహానా సంతోషం
ఆమె పేరు షేక్ రెహానా, తాడేపల్లిలో నివాసముంటోంది. విధి ఆడిన వింతనాటకంలో ఏడాది క్రితం భర్తను కోల్పోయింది. చంటిబిడ్డతో ఏంచేయాలో పాలుపోని స్థితిలో స్థానిక నాయకుల ద్వారా తమ కష్టాలను యువనేత లోకేష్ కు విన్నవించుకుంది. పాదయాత్రకు బయలుదేరే నెలముందు ఆమెకు టిఫిన్ బండి సమకూర్చారు. యువగళం పాదయాత్ర సందర్భంగా యువనేత లోకేష్ ఆకస్మికంగా రెహానా టిఫిన్ బండి వద్దకు రావడంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మీ దయతో ప్రస్తుతం నెలకు 30వేలు సంపాదిస్తూ, కుటుంబాన్ని పోషిస్తున్నానని ఆనందంగా చెబుతూ యువనేతకు అల్పాహారాన్ని అందజేసింది. గతంలో 300 వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు 800 అయిందని చెప్పింది. తాను నివసించే ఇంటికి పట్టాలేదని తెలిపింది. టిడిపి అధికారంలోకి రాగానే ఇంటిపట్టాతోపాటు ఇల్లు కూడా నిర్మించి ఇస్తామని చెప్పి యువనేత ముందుకు సాగారు.
లోకేష్ ను కలిసిన ట్రక్కర్స్ అసోసియేషన్ ప్రతినిధులు
యర్రబాలెం క్యాంప్ సైట్ లో మంగళగిరి న్యూఆంధ్ర మోటార్ ట్రక్కర్స్ అసోసియేషన్ సభ్యులు నారా లోకేష్ ను కలిసి వినతిపత్రం అందించారు. సరుకు ఎగుమతి, దిగుమతి సమయంలో ముఠా, గుమస్తా, పోలీసు మామూళ్ల పేరుతో వ్యాపార సంస్థలు డ్రైవర్లకు కిరాయి డబ్బులు పూర్తిగా ఇబ్బందులు పెడుతున్నారు. డిజిటల్ లేదా నగదుగా కిరాయి డబ్బులు అందించేలా చూడాలి. సరుకు దిగుమతి, ఎగుమతి సమయంలో లోడ్ ఆగినప్పుడు వెయిటింగ్ ఛార్జీలు ఇవ్వాలి. దళారులు ఖచ్చితంగా ప్రభుత్వ అనుమతి పొందేలా చర్యలు తీసుకోవాలి. దీనివల్ల వేల రూపాయల సర్వీసు ట్యాక్సు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. జీరో వ్యాపారానికి అవకాశం ఉండదు. డ్రైవర్లు, వాహన యజమానులకు చట్టాలు హక్కులు, విధులపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలి. రవాణా రంగం అభివృద్ధిలో వాహన తయారీ కంపెనీలను బాధ్యులను చేయాలి. రాష్ట్రస్థాయి హైవేలను ఎక్కువ మొత్తంలో అభివృద్ధి చేయాలి. వాహనదారులకు భారంగా మారిన డీజిల్ రేట్లు తగ్గించాలి. పెరిగిన రేట్లకు అనుగుణంగా గిట్టుబాటు కిరాయిని నిర్ణయించాలి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ శ్లాబ్ విధానం ద్వారా కమర్షియల్ వాహనాలకు ట్యాక్స్ తగ్గించేందుకు ఇన్సూరెన్స్ కంపెనీలను రిక్వెస్ట్ చేయాలి. డ్రైవింగ్ ట్రైనింగ్ స్కూల్ కనీసం జిల్లాకు ఒకటి ఏర్పాటుచేయాలి. డ్రైవర్ రెస్ట్ పాయింట్లను ఏర్పాటు చేయాలి. అక్కడ వసతులు కల్పించి వాహన యజమానులకు పర్యవేక్షణా బాధ్యతలను అప్పగించాలి. వన్ నేషన్..వన్ ట్యాక్సు ద్వారా రోడ్డు ట్యాక్సు క్రమబద్ధీకరించాలి. ఓవర్ లోడ్, ఓవర్ హైట్ కేసులకు లారీ యజమాని మాత్రమే కాకుండా సరుకు యజమానిని కూడా బాధ్యుడిని చేస్తూ చట్టాలను సవరించాలి. నో ఎంట్రీల పేరుతో, పోలీసు శాఖ తీసుకున్న నిర్ణయాలతో ట్రాఫికక్ నిబంధనలు అమలు చేయడంతో మా పని దినాలు తగ్గి ఇబ్బందిగా ఉంది. అభివృద్ధి చెందిన, చెందుతున్న పట్టణాల్లో షాపులకు అనుబంధంగా గోడౌన్ లను పూర్తిగా ఊరి బయట టెర్మినల్స్ ఏర్పాటు చేయాలి. ప్రమాదాల సమయంలో పోలీసులు స్టేషన్ బెయిల్ అవకాశం ఇచ్చినప్పటికీ అధికమొత్తంలో ఫార్మాల్టీన్ తో ఇబ్బంది పెడుతున్నారు. వాటినుండి విముక్తి కలిగించాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
అధికారంలోకి వచ్చాక రవాణారంగం పూర్తిగా కుదేలైంది. ప్రభుత్వం విధిస్తున్న అడ్డగోలు పెనాల్టీలు, పన్నుల కారణంగా వాహనాల యజమానులు డ్రైవర్లుగా మారాల్సిన దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా కారణంగా ఓవైపు రవాణారంగం కోలుకోలేని దెబ్బతింటే, మరోవైపు జె-ట్యాక్స్ మూలిగేనక్కపై తాటిపండులా తయారైంది. టిడిపి అధికారంలోకి రాగానే అడ్డగోలు పన్నుల విధానాన్ని సమీక్షించి, పారదర్శకమైన డిజిటల్ లావాదేవీలు జరిగేలా చర్యలు తీసుకుంటాం. హైవేల పక్కన రెస్ట్ రూమ్ ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. మామూళ్లకోసం వాహనదారులను పోలీసులు, రవాణాశాఖ అధికారులు ఇబ్బందులు పెట్టకుండా చర్యలు చేపడతాం. జీరోవ్యాపారాలకు అవకాశమివ్వకుండా దళారులను కట్టడిచేస్తాం. డ్రైవర్లు, వాహన యజమానులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. డీజిల్ రేట్లను తగ్గించి వాహనదారులు, ప్రజలకు ఉపశమనం కలిగిస్తాం.
నారా లోకేష్ ను కలిసిన తాడేపల్లి దళితులు
తాడేపల్లి ప్రకాష్ నగర్ లో దళితులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. వైసీపీ పాలనలో దళితులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. అంబేద్కర్ విదేశీవిద్య పథకాన్ని పునరుద్ధరించాలి. బెస్ట్ అవెయిలబుల్ స్కూల్స్ పథకాన్ని కొనసాగించాలి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళితులకు సబ్సిడీలోన్లు అందించాలి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని సక్రమంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలి. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దళితుల సంక్షేమానికే ఉపయోగించాలి. దళిత నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. దళితులపై వైసీపీ పాలనలో పెట్టిన అక్రమ కేసులను ఎత్తేయాలి. దళిత పారిశ్రామికవేత్తలకు సబ్సిడీలు కొనసాగించాలి. మంగళగిరి నియోజకవర్గం దళితులకు ఇళ్ల స్థలాల సమస్యల్ని పరిష్కరించాలి. బ్రహ్మానందపురంలోని కారురాయిని అక్రమంగా తవ్వుతున్న వైసిపి నాయకులపై చర్యలు తీసుకోవాలి. 1993లో ఎసిసి సిమెంట్ ఫ్యాక్టరీ బాధితులకు నేటికీ పరిహారం అందలేదు. పరిహారం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలి. టీడీపీ అధికారంలోకి వచ్చాక మా సమస్యల్ని పరిష్కరించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ
ఎన్నికల సమయంలో ముద్దులు పెడుతూ దళితులపై కపటప్రేమను ఒలకబోసిన అధకారంలోకి వచ్చాక వారి సంక్షేమాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేశారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రూ.28,147 కోట్లు దారిమళ్లించిన దళిత వైసీపీ ఎస్సీల కోసం గత ప్రభుత్వం అమలుచేసిన 27సంక్షేమ పథకాలను రద్దుచేసి తీరని అన్యాయం చేశాడు. తమకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించిన వారిపై దాడులు, హత్యలు చేయడం నిత్యకృత్యంగా మారింది. టిడిపి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే వైసీపీప్రభుత్వం రద్దుచేసిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్దరిస్తాం. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు సబ్సిడీ రుణాలు అందజేస్తాం. ఇళ్ల స్థలాలు లేని పేదలకు స్థలాలు ఇవ్వడంతో పాటు పక్కా ఇళ్లు నిర్మిస్తాం. ఎసిసి సిమెంటు ఫ్యాక్టరీ బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. అక్రమంగా క్వారీయింగ్ చేసేవారిపై ఉక్కుపాదం మోపుతాం.
నారా లోకేష్ ను కలిసిన నులకపేట గ్రామస్తులు
మంగళగిరి నియోజకవర్గం నులకపేట కాలనీల ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా ప్రాంతం ఎక్కువమంది రోజువారీ కూలీలు, పేదలు నివసిస్తున్నాం. మా ప్రాంతం ఫారెస్టు పరిధిలోనిది కావడంతో సరైన సౌకర్యాలు లేవు. త్రాగునీరు, రోడ్లు, డ్రైన్లు, కరెంటు ఇతర మౌలిక సదుపాయాలు లేవు. వర్షాకాలంలో ఇళ్లలోకి నీళ్లు, విషపురుగులు, పాములు వస్తున్నాయి. మీరు అధికారంలోకి వచ్చాక డీ ఫారెస్టుగా మార్చి మాకు ఇళ్లపట్టాలు ఇవ్వాలి. నులకపేటలోని అసైన్డ్ భూముల్లో నివాసం ఉంటున్న వారి స్థలాలకు రెగ్యులర్ పట్టాలివ్వాలి. ఈ పట్టాల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రత్యేక జీఓ మంజూరు చేయాలి. కరెంట్ బిల్లుల బాదుడుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. బిల్లులు తగ్గించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ
వైసీపీ పాలనలో అన్నివర్గాల ప్రజలు బాధితులుగా మారారు. 9సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన వైసీపీ సామాన్య ప్రజల నడ్డివిరిచారు. గతంలో 300వచ్చే కరెంటు బిల్లులు ఇప్పుడు వెయ్యిరూపాయలు వస్తోంది. టిడిపి అధికారంలోకి వచ్చాక పెంచిన విద్యుత్ ఛార్జీలను సమీక్షించి పేదలకు ఉపశమనం కలిగిస్తాం. నులకపేట ప్రాంతంలోని పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తాం. ఫారెస్టు అధికారులతో మాట్లాడి డీఫారెస్టుగా మార్చే అంశాన్ని పరిశీలిస్తాం. అసైన్డ్ భూములను రెగ్యులర్ చేసి పట్టాలిచ్చేందుకు చర్యలు తీసుకుంటాం. నులకపేట ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజీ, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.
నారా లోకేష్ ను కలిసిన తాడేపల్లి 6వ వార్డు ప్రజలు
తాడేపల్లి సలాం సెంటర్ లో 6వవార్డు ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తాడేపల్లి పట్టణంలో 60ఏళ్లుగా రైల్వే, కొండ పోరంబోకు స్థలాల్లో నివాసం ఉంటున్నాం. మా ప్రాంతంలో అధికంగా ఉన్న వడ్డెర, ఎస్సీ, మైనారిటీ వర్గాలకు భూములు లేవు. మా అధీనంలో ఉన్న భూములను రెగ్యులర్ చేస్తామని ఇచ్చిన హామీని వైసిపి నాయకులు విస్మరించారు. మీరు అధికారంలోకి వచ్చాక మా భూములను రెగ్యులరైజ్ చేయాలి. 400ఇళ్లలో వెయ్యి మంది జనాభా ఉన్నాం. ఇళ్లు లేని వారికి స్థలాలు, పక్కా ఇళ్లు మంజూరు చేయాలి. కృష్ణా నది చెంతనే ఉన్నా ఇసుక రేటు మండిపోతోంది. దీనివల్ల భవన నిర్మాణాలు బాగా తగ్గాయి. ఈ రంగంపై చాలా విభాగాల కార్మికులు ఆధార పడి ఉన్నారు. ఇసుక ధరలను అదుపు చేసేందుకు చర్యలు తీసుకోండి.
నారా లోకేష్ స్పందిస్తూ
కృష్ణానదిలో ఇసుక పరిసర గ్రామాల ప్రజలకు అందుబాటులో లేకుండా పొరుగు రాష్ట్రాలకు తరలిస్తూ వేలకోట్లు దోచుకుంటున్నారు. పేదవాడి సెంటుపట్టాల పేరుతో రూ.7వేల కోట్లు దోచుకున్న వైసిపి నేతలు, ఇచ్చిన పట్టాలను కూడా వాస్తవ లబ్ధిదారులకు కాకుండా తమ పార్టీవారికి ఇచ్చుకున్నారు. మేం అధికారంలోకి వచ్చాక దీర్ఘకాలంగా పేదల అనుభవంలో ఉన్న భూములను గుర్తించి, రెగ్యులర్ చేస్తాం. ఇల్లు లేని ప్రతిపేదవాడికి ఇల్లు నిర్మించి ఇస్తాం. మెరుగైన ఇసుక పాలసీని తెచ్చి సామాన్యులకు ఇసుకను అందుబాటులోకి తెస్తాం.
లోకేష్ ను కలిసిన తాడేపల్లి రెడ్డి సామాజికవర్గీయులు
తాడేపల్లి గేట్ సెంటర్ లో రెడ్డి సామాజికవర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా ప్రధాన వృత్తి వ్యవసాయం. పంటలకు గిట్టుబాటు ధరలు లేక నష్టపోతున్నాం. అకాల వర్షాలతో పసుపుపంట కళ్లాల్లో తడిచిపోవడంతో సరైన ధర రావడం లేదు. మిర్చి పంటలకు గిట్టుబాటు ధర రావడం లేదు. వైసీపీ ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదు. తాడేపల్లి రైవస్ కాలువపై ఉన్న బ్రిడ్జి కూలిపోయే స్థితిలో ఉంది. మీరు అధికారంలోకి వచ్చాక 4లైన్ల క్రొత్తబ్రిడ్జి నిర్మించాలి. మా రైతుల సమస్యలను పరిష్కరించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ
సొంత కుటుంబసభ్యులకే న్యాయం చేయని వైసీపీ సామాజికవర్గానికేం చేస్తారు? వైసిపి పాలనలో కేవలం నలుగురు రెడ్లు మాత్రమే బాగుపడ్డారు. ముఖ్యమంత్రి కావడానికి రెడ్డి సామాజికవర్గాన్ని వాడుకుని అధికారంలోకి వచ్చాక వదిలేశాడు. టిడిపి అధికారంలోకి వచ్చాక రైతులకు న్యాయం చేస్తాం. వైసీపీ రద్దు చేసిన రైతు సంక్షేమ పథకాలు, సబ్సిడీలను పునరుద్ధరిస్తాం. పెట్టుబడులను తగ్గించి పంటలకు గిట్టుబాటు ధర కల్పించి న్యాయం చేస్తాం. తాడేపల్లి రైవస్ కాలువ బ్రిడ్జి కొత్తది నిర్మించడానికి చర్యలు చేపడతాం.
నారా లోకేష్ ను కలిసిన తాడేపల్లి స్త్రీశక్తి ప్రతినిధులు
తాడేపల్లి ఎన్టీఆర్ విగ్రహం సెంటర్ లో స్త్రీశక్తి ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మీరు నెలకొల్పిన స్త్రీశక్తి స్వయం ఉపాధి శిక్షణను కొనసాగిస్తున్నాం. ఈ సంస్థలో అనేక మంది మహిళలు కుట్టుపని నేర్చుకుని ఉపాధి పొందారు. మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని నింపే మరిన్ని ఉపాధి కార్యక్రమాలు పెంపొందించండి. తాడేపల్లిలోని స్త్రీశక్తి బ్రాంచిని కొనసాగించాలని మహిళలందరూ కోరుకుంటున్నారు. అధికారంలోకి వచ్చాక మరిన్ని సదుపాయాలు పెంచాలని కోరుతున్నాం.
నారా లోకేష్ స్పందిస్తూ
మహిళల స్వావలంబనకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చే పార్టీ తెలుగుదేశం. చంద్రబాబునాయుడు డ్వాక్రాసంఘాల ద్వారా రాష్ట్రంలో మహిళల స్వావలంబనకు కృషిచేశారు. అధికారంతో సంబంధం లేకుండా మంగళగిరి నియోజకవర్గంలో 27 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాను. స్త్రీశక్తి కార్యక్రమం ద్వారా మహిళలకు వివిధ వృత్తుల్లో శిక్షణతోపాటు పనిముట్లు కూడా అందజేస్తున్నాం. అధికారంలోకి వచ్చాక స్త్రీ శక్తి మోడల్ కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా చేపడతాం.
లోకేష్ ను కలిసిన అగ్నికుల క్షత్రియులు
తాడేపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద అగ్నికుల క్షత్రియ ఐక్యవేదిక నాయకులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అగ్రికుల క్షత్రియులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్థిక తోడ్పాటునందించాలి. 45ఏళ్లు నిండిన అగ్రికుల క్షత్రియులకు కార్పొరేషన్ నుండి రూ.5వేలు పెన్షన్ మంజూరు చేయాలి. వేట నిషేధ సమయంలో ఒక్కో కుటుంబానికి రూ.10వేలు జీవన భృతి ఇవ్వాలి. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ.10లక్షలు నష్టపరిహారం అందించాలి. స్థానిక మత్స్యకార సొసైటీలకు చెరువులు, ఇసుక రీచ్ లు నిర్వహించే అవకాశాన్ని ఇవ్వాలి. నిరుద్యోగ యువకులకు ఆక్వా కల్చర్, టూరిజం శాఖలో ఉద్యోగాలు కల్పించాలి. కార్పొరేషన్ ద్వారా ఇళ్ల నిర్మాణం, విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక సదుపాయాలు కల్పించాలి. మత్స్యకార మహిళల అభివృద్ధి కోసం మార్కెట్లు, సదుపాయాలు ఏరపాటు చేయాలి. జనాభా ప్రాతిపదికన మాకు చట్టసభల్లో స్థానాలు, సీట్లు కేటాయించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ
రాష్ట్రంలో వైసీపీఅధికారంలోకి వచ్చక కులానికొక కుర్చీలేని కార్పొరేషన్ ఏర్పాటుచేసి దారుణంగా మోసగించారు. సాక్షాత్తు బిసి సంక్షేమ మంత్రి పేషీల్లో ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేక ఉద్యోగులు పేషీలకు తాళాలు వేశారు. వేట నిషేధ సమయంలో గతంలో అందించిన సబ్సిడీలను పునరుద్దిస్తాం. జిఓ 217రద్దుచేసి, చేపలచెరువులను మత్స్యకార సొసైటీలకే కేటాయిస్తాం. మత్స్యకారులకు మార్కెట్లు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. ప్రమాదంలో చనిపోయిన మత్స్యకారులకు చంద్రన్న బీమా ద్వారా ఆర్థికసాయం అందిస్తాం. ఇళ్లులేని మత్స్యకారులకు పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తాం.
నారా లోకేష్ ను కలిసిన మంగళగిరి గిరిజనులు
ఉండవల్లి సెంటర్ లో మంగళగిరి నియోజకవర్గ ఎస్టీ సామాజికవర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మాకు ఎస్టీ కమ్యూనిటీ హాలు, మార్కెట్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలి. మంగళగిరి లేదా తాడేపల్లిలో గిరిజన కళాశాల ఏర్పాటు చేయాలి. ఇల్లు లేని ఎస్టీ వారికి ఇళ్లు నిర్మించాలి. రాజధాని ప్రాంతం లేదా తాడేపల్లిలో స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలి. ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఎస్టీల అభివృద్ధికే కేటాయించాలి. గిరిజన పుత్రిక పెళ్లికానుక పథకాన్ని పునరుద్ధరించాలి. ఎస్టీలకు 50ఏళ్లకు పెన్షన్ పునరుద్ధరించాలి. మీరు అధికారంలోకి వచ్చాక మా సమస్యలను పరిష్కరించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ
వైసిపి అధికారంలోకి ఎస్టీలకు చెందాల్సిన రూ.5,355కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించారు. అధికారంలోకి వచ్చాక తాడేపల్లి – మంగళగిరి నడుమ ఎస్టీ కమ్యూనిటీ హాలు, మార్కెట్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడతాం. గిరిజనులకు గత ప్రభుత్వంలో అమలుచేసిన సంక్షేమ కార్యక్రమాలను పునరుద్దరిస్తాం. ఇల్లులేని పేద గిరిజనులందరికీ ఇల్లు నిర్మించి ఇస్తాం. ఎస్టీ కార్పొరేషన్ ను బలోపేతం చేసి వారికి సబ్సిడీపై స్వయం ఉపాధి రుణాలిస్తాం. జనాభానుబట్టి ఈ ప్రాంతంలో గిరిజన కళాశాల, అంబేద్కర్ స్టడీసర్కిల్ ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలిస్తాం.
Also Read this Blog: Empowering Youth: Insights from Nara Lokesh’s Yuvagalam Padayatra
Tagged:#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh